Homeభక్తిShravana Masam | శుభ ముహూర్తాలకు వేళాయె..

Shravana Masam | శుభ ముహూర్తాలకు వేళాయె..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Shravana Masam | హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో శ్రావణం(Shravanam) ఒకటి. ఈ నెలలో రాహుకాలం, దుర్ముహూర్తం, వర్జ్యం వంటి అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆధ్యాత్మికంగా ఎన్నో విశేషాలను కలిగి ఉన్న ఈ నెల శుభ ముహూర్తాల సమ్మేళనంగా పేర్కొనబడుతోంది. ఈనెల 25వ తేదీన శ్రావణమాసం(Shravana masam) ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు నుంచి వివాహాది శుభకార్యాలకు అనువైన మంచి ముహూర్తాలు ఉన్నాయి.

Shravana Masam | శ్రావణమాసం విశిష్టత..

శ్రావణ మాసం తెలుగు సంవత్సరంలో వచ్చే ఐదో నెల. చంద్రుడు శ్రవణ నక్షత్రంతో సంచరించే సమయంలో వస్తుంది కాబట్టి శ్రావణ మాసం అంటారు. ఈనెల శ్రీమహావిష్ణువు(Shri Maha Vishnu) జన్మ నక్షత్రంతో ముడిపడి ఉండడం వల్ల దీనికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. శివుడు, లక్ష్మీదేవి(Lakshmi), పార్వతీదేవికి సైతం ఈ మాసం ప్రీతికరమైనది. ఈ నెలలో పూజలు, వ్రతాలు, నోములు చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణంలో చేపట్టే శుభకార్యాలు సుఖసంతోషాలను, సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయని ప్రజలు నమ్ముతారు.

Shravana Masam | శుభ ముహూర్తాలు ఇవే..

ఈనెల 25వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. 26వ తేదీ వచ్చే నెల 17వ తేదీ వరకు పలు శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈనెల 26, 30, 31 తేదీలతో పాటు వచ్చేనెల 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17 తేదీలలో మంచి ముహూర్తాలు ఉండడంతో భారీ ఎత్తున వివాహాది శుభకార్యాలు జరగనున్నాయి.

Must Read
Related News