Homeక్రీడలుAsia Cup | నువ్వేంట్రా క‌ప్‌ ఇచ్చేది.. రోహిత్ స్టైల్‌లో తిల‌క్, దూబే సెల‌బ్రేష‌న్స్

Asia Cup | నువ్వేంట్రా క‌ప్‌ ఇచ్చేది.. రోహిత్ స్టైల్‌లో తిల‌క్, దూబే సెల‌బ్రేష‌న్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్‌ ఫైనల్ ముగిసినా, దాని వెనక జరిగిన రాజకీయాలు, వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

పాక్‌ కేంద్రంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్‌ ముగింపు వేడుకల్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) చీఫ్ మొహసిన్ నఖ్వీ ప్రవర్తనపై భారత ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా, వ్యంగ్యంగా తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు.

Asia Cup | ట్రోఫీ విషయంలో అసహనం, అవమానం

ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌( Pakistan)పై ఘన విజయం సాధించిన అనంతరం ట్రోఫీ అందుకునే వేడుకలో భారత ఆటగాళ్లు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో నఖ్వీ తీవ్రంగా అవమానానికి గురయ్యారని, ఆయన స్వయంగా ACC అంతర్గత సమావేశాల్లో వాపోయినట్టు సమాచారం. “నేను కార్టూన్‌లా కనిపించాను” అంటూ తన బాధను వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే భారత యువ ఆటగాళ్లు తిలక్ వర్మ(Tilak Varma) , శివమ్ దూబే(Shivam Dubey), ట్రోఫీ ఇవ్వకపోవడాన్ని వ్యంగ్యంగా ఎత్తి చూపుతూ సరదా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తిలక్ వర్మ, తన స్నేహితులతో కలిసి ఊహాత్మకంగా ట్రోఫీని ఎత్తుకున్నట్లుగా చూపిస్తూ కేరింతలు కొట్టాడు. శివమ్ దూబే కూడా ఒక చిన్న ట్రోఫీని పట్టుకొని, రోహిత్ శర్మ(Rohit Sharma) తరహాలో విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నాడు.ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పీసీబీ (PCB) చీఫ్‌కు పరోక్షంగా గట్టి సందేశం ఇస్తున్నాయని భావిస్తున్నారు. బహుమతులు అందించే సమయంలో ట్రోఫీ ఇవ్వ‌ని కారణంగా, భారత జట్టు సభ్యులు ఖాళీ చేతులతోనే విజయం సెలబ్రేట్ చేయాల్సి వచ్చింది.వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ స్టైల్లో సూర్యకుమార్ యాదవ్, ట్రోఫీ లేకుండానే ఒక “ఐకానిక్ సెలబ్రేషన్” చేస్తూ కనిపించటం నెటిజన్లని ఆక‌ర్షించింది. అయితే బీసీసీఐ ఇప్పటికే ఆసియా కప్(Asia Cup) ట్రోఫీపై స్పష్టత కోరుతూ, దీర్ఘకాలిక ఆలస్యం లేకుండా తమకు పంపించాలని ఏసీసీకి డిమాండ్ చేసింది. కానీ, మొహసిన్ నఖ్వీ మాత్రం తనకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ, ట్రోఫీ పంప‌డంపై మౌనం వహిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by shivam dube (@dubeshivam)

Related News