అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs SA | అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఉర్రూతలూగించింది. శుక్రవారం జరిగిన ఈ కీలక పోరులో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నేతృత్వంలోని భారత జట్టు, సౌతాఫ్రికాను 30 పరుగుల తేడాతో ఓడించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.
ఈ విజయంతో సొంత గడ్డపై టీ20 సిరీస్‌లో తమని ఎవరు కొట్టలేరని మరోసారి నిరూపించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి భారీ 231 పరుగులు చేసింది. యువ ఆటగాడు తిలక్ వర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కలిసి భారత ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశారు.
IND vs SA | మరో విజయం..
తిలక్ వర్మ (Tilak Varma) 42 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 73 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి స్టేడియాన్ని ఊపేశాడు. ఇది భారత్ తరఫున రెండో వేగవంతమైన టీ20 అర్ధశతకం కావడం విశేషం. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అంతకుముందు ఓపెనర్లు అభిషేక్ శర్మ (37), సంజూ శామ్సన్ (34) కూడా శుభారంభం ఇచ్చారు.232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు క్వింటన్ డి కాక్ దూకుడు ఆరంభం ఇచ్చాడు. రీజా హెండ్రిక్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించిన డి కాక్ (65) భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అయితే 11వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా కీలక బ్రేక్ ఇచ్చి డి కాక్‌ను పెవిలియన్‌కు పంపడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.
ఆ తర్వాత స్పిన్ మాంత్రికుడు వరుణ్ చక్రవర్తి రంగంలోకి దిగాడు. ఒకే ఓవర్లో కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్తో పాటు డోనోవన్ ఫెరీరాను అవుట్ చేసి సౌతాఫ్రికా ఆశలకు గట్టి దెబ్బకొట్టాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (18), జార్జ్ లిండే (16) ప్రతిఘటించే ప్రయత్నం చేసినా, భారీ లక్ష్యం ముందు అది సరిపోలేదు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ హీరోగా నిలిచాడు. బుమ్రా తనదైన శైలిలో మార్కో జాన్సెన్ను అవుట్ చేయగా, అర్ష్‌దీప్ సింగ్ కూడా కీలక వికెట్ తీసి భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఫలితంగా సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. ఈ ఘన విజయంతో భారత్ స్వదేశంలో తన అజేయమైన టీ20 సిరీస్ రికార్డును 18కి పెంచుకుంది. 2019 తర్వాత సొంత గడ్డపై ఒక్కటీ20 సిరీస్ కూడా ఓడిపోకపోవడం టీమిండియా స్థిరత్వానికి నిదర్శనంగా నిలిచింది. యువత, అనుభవజ్ఞుల సమ్మేళనంతో భారత్ India మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.