ePaper
More
    HomeజాతీయంTikTok | భారత్​లోకి టిక్ టాక్..! కొందరికి అందుబాటులోకి వచ్చిన యాప్

    TikTok | భారత్​లోకి టిక్ టాక్..! కొందరికి అందుబాటులోకి వచ్చిన యాప్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TikTok | భారతదేశంలో నిషేధించిన చైనీస్ వీడియో-షేరింగ్ ప్లాట్ఫామ్ అయిన టిక్టాక్ తిరిగి వస్తుందా? భద్రతా కారణాలతో ఐదు సంవత్సరాల క్రితం విధించిన నిషేధం ఎత్తివేయనున్నారా? అంటే అవుననే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఈ యాప్ భారతదేశంలో తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ షార్ట్ వీడియో యాప్ వెబ్సైట్ కొంతమంది వినియోగదారులకు అందుబాటులో ఉంది, ఇది భారతదేశంలో టిక్టాక్ తిరిగి వస్తుందనే ఊహాగానాలకు దారితీసింది. అయితే, టిక్టాక్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లో మాత్రం ఇప్పటికైతే అందుబాటులో లేదు.

    TikTok | ఆకట్టుకున్న యాప్..

    చైనాకు చెందిన టిక్ టాక్(TikTok) అనతి కాలంలోనే కోట్లాది మంది యూజర్లకు చేరువైంది. ఈజీగా వీడియోలు తయారు చేసుకునే ఈ యాప్ స్వల్పకాలంలోనే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, గల్వాన్ లోయ సంఘర్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం చైనా(CHINA)కు చెందిన వందలాది యాప్ లను నిషేధించింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం జూన్ 2020 నుండి భారతదేశంలో టిక్టాక్ను నిషేధించించింది.

    TikTok | అధికారిక ప్రకటన రాలేదు..

    భారతదేశానికి షార్ట్ వీడియో యాప్ తిరిగి రావడంపై టిక్టాక్ లేదా దాని మాతృ సంస్థ బైట్ డాన్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ కొందరికి ఈ యాప్ తిరిగి అందుబాటులోకి రావడం అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. కొంతమంది వినియోగదారులు Xలో వెబ్సైట్ తమకు అందుబాటులో లేదని నివేదించారు. అయితే టిక్ టాక్ను దశల వారీగా అందుబాటులోకి తీసుకొస్తారన్న ప్రచారం జరుగుతోంది.

    Latest articles

    IRCTC International Tours | రూ.65 వేలకు థాయ్​లాండ్​.. రూ. 45 వేలకు నేపాల్​.. ఐఆర్​సీటీసీ ఇంటర్నేషనల్​ టూర్​ ప్యాకేజీలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IRCTC International Tours : దేశీయ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల టూర్ ప్యాకేజీలను ఐఆర్​సీటీసీ (IRCTC)...

    Bangladesh team | ఆసియా కప్‎కు‎ బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన.. వచ్చే నెలలోనే పోరు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bangladesh team : ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు (Bangladesh cricket team) సిద్ధం...

    Attempted murder | సూర్యాపేట జిల్లాలో దారుణం.. ముగ్గురిపై హత్యాయత్నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Attempted murder : సూర్యాపేట జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు....

    Drunk and drive cases | డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు.. ఒకేరోజు 17 మందికి జైలుశిక్ష.. 74 మందికి జరిమానా

    అక్షరటుడే, కామారెడ్డి : Drunk and drive cases : రోడ్డు ప్రమాదాలు (road accidents) నివారించేందుకు డ్రంక్...

    More like this