అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Panchayat Elections | మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మూడో విడత ఆర్మూర్ డివిజన్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. సబ్ డివిజన్ పరిధిలో 12 మండలాల్లోని 148 గ్రామపంచాయతీలు, 1,496 పోలింగ్ స్టేషన్లలో 3,26,029 మంది ఓటర్లు ఉన్నారన్నారు.
Panchayat Elections | అవాంఛనీయ ఘటనలు జరగకుండా..
ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్‌శాఖ (Nizamabad Police Department) పరంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశామని సీపీ వెల్లడించారు. ఇందుకుగాను సబ్ డివిజన్ పరిధిలోని ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో మూడు చెక్‌పోస్ట్‌లను (పోతంగల్, సాలూర, ఖండ్గావ్) ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
Panchayat Elections | 60 సమస్మాత్మక ప్రాంతాలు..
60 సమస్మాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థ చేశామని, 24 ఎఫ్ఎస్టీ టీంలు, 5 ఎస్ఎస్టీ టీంలు ఏర్పాటు చేశామని సీపీ పేర్కొన్నారు. ఇప్పటివరకు 6 కేసుల్లో 100.24 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేశామన్నారు. వాటి విలువ దాదాపు రూ. 77,447 ఉందన్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో బైండోవర్లు మొత్తం 194 మందిని సంబంధిత తహశీల్దార్ల (Tahsildars) ఎదుట బైండోవర్ చేశామని తెలిపారు.
Panchayat Elections | ఎన్నికల నియమావళిని ఉల్లంఘించవద్దు..
ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన ఘటనల్లో ఇద్దరిపై కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. కమ్మర్పల్లి, నందిపేట్ పోలీస్ స్టేషన్లలో (Nandipet Police Station) ఆయా కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 18 మంది వద్ద గన్ లైసెన్లు కలిగిన వారు ఉండగా అందులో 11డిపాజిట్ అయ్యాయన్నారు. మిగితావి బ్యాంక్‌లకు సంబంధించినవిగా పేర్కొన్నారు.
Panchayat Elections | ర్యాలీలు, సభలు నిర్వహించవద్దు..
కమిషనరేట్ పరిధిలో అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించవద్దని సీపీ సాయిచైతన్య సూచించారు. 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉందని పేర్కొన్నారు. అనుమతి ర్యాలీలు నిర్వహించిన ఎడపల్లి పోలీస్ స్టేషన్ (Yedapally Police Station) పరిధిలోని ఠానాకలాన్ గ్రామంలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 1100 మందిని సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు.