అక్షరటుడే నిజామాబాద్ సిటీ: UGC NET | యూజీసీ-ఎన్ఈటీ పరీక్షకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ డివిజన్లోని పరీక్ష జరిగే కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈనెల 25 నుంచి 29 వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని మున్నూరుకాపు సంఘం, అర్సపల్లి బైపాస్‌రోడ్డులో ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద నిషేదాజ్ఞలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆయా కేంద్రాల సమీపంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదన్నారు. నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరగవద్దని సూచించారు.
