అక్షరటుడే, ఇందూరు: Panchayat Elections | పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని (Commissioner Rani Kumudi) సూచించారు. జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించి గ్రామాల వారీగా అప్డేట్ చేసిన రిజర్వేషన్లు.. ఏ విడతలో పోలింగ్ ఉంటుంది.. పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ తదితర వివరాలు వెంటనే టీ పోల్ వెబ్సైట్ (T-Poll website), యాప్లో నమోదు చేయాలని సూచించారు. అలాగే వీటిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారి నియమించాలని సూచించారు. ఫిర్యాదులను మూడు రోజుల్లో పరిష్కరించాలని తెలిపారు. నవంబర్ 23న విడుదల చేసిన ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాలను అనుసరిస్తూ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు, ఫర్నిచర్, విద్యుత్ సరఫరా, తాగునీరు, మూత్రశాలలు తదితర కనీస వసతులు ఉండేలా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సంబంధిత తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థుల జాబితా, అప్పీల్స్, ఉపసంహరణ అన్ని సజావుగా సాగేలా చూడాలని చెప్పారు. జిల్లాలో ఉన్న ప్రింటర్లకు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎన్నికల ప్రచారానికి (election campaign) సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలు నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని చెప్పారు.
Panchayat Elections | ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం
ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, ఒక ఏఈవో, జిల్లాకు ఒక స్టాటిక్ సర్వే లైన్స్ బృందం ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషనర్ (Election Commissioner) ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. జిల్లాస్థాయిలో ఎంసీఎంసీ కమిటీ, మీడియా సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా అనుమతి ఉండాలన్నారు. రైతులు పంట డబ్బులు తీసుకొని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
1 comment
[…] ఎన్నికల (Panchayat Elections) రిజర్వేషన్ GO 46 పై హైకోర్టులో విచారణ […]
Comments are closed.