HomeUncategorizedTiger Shroff | భారీ కండ‌లు చూపిస్తూ ఫ‌న్నీ క్రికెట్ ఆడిన టైగ‌ర్ ష్రాఫ్‌.. వీడియో...

Tiger Shroff | భారీ కండ‌లు చూపిస్తూ ఫ‌న్నీ క్రికెట్ ఆడిన టైగ‌ర్ ష్రాఫ్‌.. వీడియో వైర‌ల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Tiger Shroff | బాలీవుడ్‌లో బెస్ట్ యాక్షన్ హీరోల్లో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) కూడా ఒకరు. ది గ్రేట్ ఆర్టిస్టు జాకీ ష్రాఫ్(Jackie Shroff) కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన యాక్షన్, డ్యాన్స్‌లతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌‌ను, మార్కెట్‌ను సంపాదించుకున్నాడు టైగ‌ర్. 2014లో వచ్చిన హీరోపంతి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు టైగర్ ష్రాఫ్. ఈ సినిమా తెలుగు బ్లాక్ బస్టర్ పరుగుకు రీమేక్ కాగా.. పరుగు(Parugu movie) తెలుగులో ఫ్లాప్ అయింది కానీ.. బాలీవుడ్ రీమేక్ మాత్రం బంపర్ హిట్టయింది. ఆ తర్వాత బాఘీ, బాఘీ2 వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరో రేంజ్‌కు వెళ్లిపోయాడు.

Tiger Shroff | వారెవ్వా..

అయితే ఈ మధ్య టైగ‌ర్‌కి హ‌ట్ అనేది రావ‌డం లేదు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన గణపత్: పార్ట్ 1(Ganapath) సినిమా ప్రపంచవ్యాప్తంగా 2023లో విడుదలైంది. ఈ సినిమాలో టైగర్​కు జోడిగా కృతిసనన్ హీరోయిన్​గా నటించింది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా మొదటి రోజు రూ.2.5 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్​గా రూ.18కోట్లు వసూలు చేసింది. కాగా.. టైగర్ ష్రాఫ్ ఒకొక్క సినిమాకు రూ. 20కోట్ల నుంచి రూ. 40కోట్ల వరకు తీసుకుంటాడు. ఈ సినిమా కనీసం టైగర్ ష్రాఫ్ రెమ్యూనరేషన్ అంత కూడా రాబట్టలేకపోయింది.

టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం ‘బాఘీ 4’(Baaghi 4) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ మరియు సోనం బజ్వా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5, 2025న విడుదల కానుంది. అయితే తాజాగా టైగర్ ష్రాఫ్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇందులో టైగ‌ర్ త‌న సిక్స్ ప్యాక్ చూపిస్తూ క్రికెట్ Cricket ఆడాడు. త‌న యాబ్స్ చూపిస్తూ అద్భుత‌మైన బ్యాటింగ్ చేస్తుండ‌డం అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఆయన గాల్లోకి సిక్స్ కొడుతుండగా, పక్కన నిలబడి ఉన్న అక్షయ్ కుమార్(Akshay Kumar) ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండడం స్పష్టంగా కనిపించింది. దీనికి క్యాప్ష‌న్‌గా టెక్నిక్ ఏమి లేదు, కానీ బ‌లంగా కొడుతున్నా అని కామెంట్ చేశాడు టైగ‌ర్. దీనికి భారీ ఎత్తున రెస్పాన్స్ వ‌స్తుంది.