ePaper
More
    Homeఅంతర్జాతీయంViral Video | ఎదురుప‌డ్డ పులి… ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో చూస్తే న‌వ్వాపుకోలేరు.. వైర‌ల్...

    Viral Video | ఎదురుప‌డ్డ పులి… ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో చూస్తే న‌వ్వాపుకోలేరు.. వైర‌ల్ వీడియో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Viral Video | అడవిలో ఉండాల్సిన పులులు అప్పుడప్పుడూ జనావాసాల్లోకి రావడం ఈ మ‌ధ్య స‌హ‌జంగా చూస్తున్నాం. ఆ సందర్భాల్లో పులులు(Tigers) మనుషులపై లేదా పశువులపై దాడికి దిగే ఘటనలు చాలానే జరుగుతున్నాయి. కానీ తాజాగా ఓ ఘటనలో… పులి ఓ మనిషిని చూసి పరారైంది! దీన్ని బట్టి చూస్తే, మనిషిని చూసి పులి కూడా భయపడే రోజు వచ్చేసిందేమో అని నెటిజ‌న్స్ ముచ్చ‌టించుకుంటున్నారు. వివ‌రాల‌లోకి వెళితే
    ఇంటికి కాపలాగా ఉన్న ఓ వ్యక్తి రాత్రి సమయంలో ఎప్పటిలా అలర్ట్‌గానే ఉన్నాడు. అర్ధరాత్రి కుక్కలు పదేపదే మొరుగుతుండడంతో ఏం జరిగిందో చూడాలనుకున్నాడు.

    Viral Video | నిజంగా ఫన్నీనే..

    ఇంటి బయటకు వచ్చి కొంచెం దూరం నడవగానే… మ‌లుపు నుండి వ‌చ్చిన‌ పులి అతడికి ఎదురైంది. దాంతో భయం పట్టలేక ఆ వ్యక్తి అరుస్తూ ఇంట్లోకి పరుగెత్తాడు. అనుకోకుండా ఎదురైన వ్యక్తిని చూసిన పులి కూడా అదే వేగంతో తిరిగి పరుగెత్తడం చూసి నవ్వు ఆపుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోకి నెటిజన్ల స్పందనలు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి.

    ఒక నెటిజ‌న్ .. పులికి హాయ్ చెప్పి వచ్చాడుగా..! అని ఓ నెటిజ‌న్ అంటే.. ఇతడు ఏదో కొత్త జంతువుల జాతి అనిపించి పులే భయపడిపోయిందేమో! అని ఇంకొక‌రు కామెంట్ చేశారు. పలు ఫన్నీ ఎమోజీలతో, క్రియేటివ్ మీమ్స్‌తో ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 4.2 మిలియన్లకు పైగా వ్యూస్, 1.79 లక్షల లైక్స్ వచ్చాయి. సాధారణంగా పులిని చూస్తే మనుషులు భయపడతారు. కానీ ఈ వీడియోలో మాత్రం పరిస్థితి తారుమారైంది. పులే భయంతో పరుగులు పెట్టింది! కొన్ని సార్లు ప్రకృతిలో మనం ఊహించని సంఘటనలు చూస్తే నవ్వు వచ్చేలా ఉంటుంది . ఈ వీడియో అచ్చం అలాంటిదే. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది.

    https://www.instagram.com/p/DNH8Ux1s18g/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

    Latest articles

    CM Revanth Reddy | ​ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం.. అధికారులకు కీలక సూచనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ వర్షాలతో వరద ముంపునకు...

    Women safety | మహిళలూ.. క్యాబ్‌లో ఒంటరిగా జర్నీ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

    అక్షరటుడే, హైదరాబాద్: Women safety | ఉరుకుల పరుగుల జీవనంలో క్యాబ్‌లలో ప్రయాణించడం చాలా సౌకర్యంగా మారింది. కానీ,...

    Office Politics | ఆఫీసులో నచ్చని వారితో కలిసి పనిచేయడం ఎలా?

    అక్షరటుడే, హైదరాబాద్ : Office Politics | ఆఫీసులో ఉద్యోగం(Office Job) అంటే కేవలం పని చేయడం మాత్రమే...

    Freeze Chicken | ఫ్రిజ్‌లోని చికెన్ తింటున్నారా? అయితే మీకు ఆ రిస్క్ ఎక్కువ

    అక్షరటుడే, హైదరాబాద్ : Freeze Chicken | ఆధునిక జీవనశైలిలో చాలామంది సౌలభ్యం కోసం చికెన్‌ను ఎక్కువ మొత్తంలో...

    More like this