అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizamsagar mandal | నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టై, బెల్టులను పంపిణీ చేశారు.
గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు, కాంగ్రెస్ నాయకుడు మెంగారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు (MLA Thota Lakshmi Kantha Rao) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు టై, బెల్టులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, ఎంఈవో తిరుపతి రెడ్డి, ఎంపీడీవో అనిత, కాంప్లెక్స్ హెచ్‌ఎం వెంకట్రాం రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు సంతోష్, వడ్డేపల్లి ప్రజా పండరి, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
