అక్షరటుడే, ఇందూరు: Thyroid problems | ప్రస్తుత కాలంలో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలి మార్పులు, మానసిక ఒత్తిడి, హార్మోన్ అసమతుల్యత వల్ల మహిళలు, పురుషులతోపాటు యువతలో కూడా థైరాయిడ్ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెబుతున్నారు.
థైరాయిడ్ గురించి Medicover Hospitals వైద్యుడు, జనరల్ సర్జన్ మనోజ్ ఈ విధంగా వివరిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి శరీరంలోని మెటబాలిజం, శక్తి వినియోగం, హార్మోన్ సమతుల్యాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ మనోజ్ తెలిపారు. ఈ గ్రంథి మరీ ఎక్కువగా పనిచేసే “హైపర్ థైరాయిడిజం”, తక్కువగా పనిచేసే “హైపో థైరాయిడిజం” అనే ప్రధాన రకాల సమస్యలు కనిపిస్తాయని పేర్కొన్నారు.
Thyroid problems | థైరాయిడ్ లక్షణాలు:
- బరువులో వేగమైన మార్పులు
- అలసట, నిస్సత్తువ
- జుట్టు రాలడం
- గుండె వేగం కావడం
- మానసిక ఆందోళన
- మెడ వద్ద వాపు
ఈ లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. థైరాయిడ్ నిర్ధారణలో థైరాయిడ్ ప్రొఫైల్, అల్ట్రాసౌండ్, అవసరమైనప్పుడు ఫైన్ నీడిల్ బయాప్సీ (FNAC) వంటి పరీక్షలు అత్యంత కీలకమని డాక్టర్ తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే పేషెంట్లు పూర్తిగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.
Medicover Hospitals లో ఆధునిక డయాగ్నస్టిక్ సదుపాయాలు, నిపుణుల బృందం, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ టెక్నిక్స్ తో థైరాయిడ్ సంబంధిత చికిత్సలు అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్నామని డా. మనోజ్ చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి నియంత్రణ, పర్యాయ పరీక్షల వంటి చర్యలు థైరాయిడ్ సమస్యలను ముందస్తుగా నివారించడంలో కీలక భూమిక పోషిస్తాయని వివరించారు.