ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిThunderstorm | ఇంటిపై పడిన పిడుగు.. చెడిపోయిన విద్యుత్ ఉపకరణాలు

    Thunderstorm | ఇంటిపై పడిన పిడుగు.. చెడిపోయిన విద్యుత్ ఉపకరణాలు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Thunderstorm | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో వర్ని మండల కేంద్రంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఓ ఇంటిపై పిడుగు పడింది. మండల కేంద్రంలోని మెహర్ బాబా కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్ భవనం పిల్లర్​పై పిడుగు పడింది. దీంతో పిల్లర్ పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లోని విద్యుత్ మీటర్​ కాలిపోగా.. ఇతర విద్యుత్తు ఉపకరణాలు చెడిపోయాయి. చుట్టుపక్కల నాలుగు ఇళ్లలో కూడా విద్యుత్ ఉపకరణాలు చెడిపోయినట్లు స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవగా పడి పిడుగు పడింది.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...