Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar project | నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో ముగ్గురు యువకుల గల్లంతు

Nizamsagar project | నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో ముగ్గురు యువకుల గల్లంతు

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar project : కామారెడ్డి జిల్లా (Kamareddy district) నిజాంసాగర్ మండలం హసన్​పల్లి గ్రామ శివారులోని పిప్పి రేగడి సమీపంలో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్(Nizamsagar backwater)లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.

స్థానికుల కథనం ప్రకారం.. మధుకర్ గౌడ్(ఎల్లారెడ్డి), నవీన్(తిమ్మారెడ్డి), హర్ష (సోమర్ పేట్)తో పాటు పలువురు యువకులు సోమవారం సాయంత్రం క్రికెట్ ఆడిన అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్​లో ఈత కొట్టడానికి వెళ్లారు. వారిలో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు.

ఎల్లారెడ్డి మండల నాయకులు నూనుగొండ శ్రీనివాస్, విద్యాసాగర్, కుర్మ సాయిబాబా, ఆజహార్, జనార్దన్​ రెడ్డి, పాపయ్య, చిరంజీవులు ఘటనా స్థలానికి చేరుకుని ఎల్లారెడ్డి అగ్నిమాపక శాఖ(fire department), పోలీసుల(Police)కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడినా జాడ తెలియలేదు. చేపల వేట కోసం నీటిలో వేసిన వలలో చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.