అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Street Dogs | ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కలు (Street Dogs) దాడి చేయగా మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ (Medak) జిల్లా శివ్వంపేట మండలం రూప్లతండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన జరుప్ల హోబ్యా, లావణ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చివరివాడైన నితున్(3) ఆడుకుంటుండగా శుక్రవారం కుక్కలు దాడి చేశాయి. గుంపులుగా వచ్చిన కుక్కలు బాలుడిని లాక్కెళ్లాయి. దీంతో స్థానికులు గమనించి వాటిని తరిమేశారు.
కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన నితున్ను తల్లిదండ్రులు నర్సాపూర్ (Narsapur) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో తండాలో విషాదం నెలకొంది.
Street Dogs | పుట్టిన రోజు తెల్లారే..
నితున్ పుట్టిన రోజు వేడులకను గురువారం తల్లిదండ్రులు ఘనంగా నిర్వహించారు. మరుసటి రోజు బాలుడు కుక్కల దాడిలో మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి వరకు అన్న, అక్కలతో ఆడుకున్న బాలుడు కుక్కల దాడిలో మృతి చెందడంతో తండాలో విషాదం అలుముకుంది.
Street Dogs | రెచ్చిపోతున్న కుక్కలు
రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కల బెడద అధికం అయింది. ఎక్కడ చూసిన కుక్కలే కనిపిస్తున్నాయి. ఒంటరిగా వెళ్తున్న వారు, చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తున్నాయి. కుక్కల దాడిలో ఎంతో మంది చనిపోతున్నారు. చాలా మంది గాయపడుతున్నారు. అయినా ప్రభుత్వం, అధికారుల కుక్కల బెడద నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
Street Dogs | మానవ హక్కుల కమిషన్ సీరియస్
కుక్కల తండాలో బాలుడు మృతి చెందడంపై మానవ హక్కుల కమిషన్ (Human Rights Commission) సీరియస్ అయింది. ఈ ఘటనపై సుమోటగా కేసు నమోదు చేసింది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో వీధికుక్కల దాడిలో మరణించిన వారి వివరాలను ఈ నెల 29లోగా సమర్పించాలని సీఎస్‌ను ఆదేశించింది.