అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. లోకోపైలట్‌లు (Loco Pilots) అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.
ఛత్తీస్‌గఢ్ (Chattisgarh)లో ఇటీవల ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ఆ ఘటన మరువక ముందే మరోసారి మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. రెండు గూడ్స్ రైళ్లు, ఒక ప్రయాణీకులతో కూడిన MEMU రైలు గురువారం ఒకేసారి ట్రాక్‌పైకి వచ్చాయి. ఆటోమేటిక్ సిగ్నలింగ్ (Automatic Signaling) లోపంతో ఈ ఘటన సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే లోకోపైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించి రైళ్లను ఆపేయడంతో ఎవరికీ గాయాలు కాలేదు.
Chattisgarh | ప్రయాణికుల ఆందోళన
ప్యాసింజర్ రైలు (Passenger Train) ముందు, వెనుక భాగాల్లో గూడ్స్ రైళ్లు వచ్చాయి. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకవేళ ప్రమాదం జరిగి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది. అయితే లోకోపైలెట్లు గమనించి రైళ్లను నిలిపివేశారు. దీంతో మెము ట్రెయిన్లోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోయారు. రైళ్లు ఆగిన వెంటనే భయాందోళనలు చెలరేగాయి. ఈ ఘటన కోట్మిసోనార్ (Kotmisonar), జైరాంనగర్ రైల్వే స్టేషన్ల (Jairamnagar Railway Stations) మధ్య జరిగింది. రైల్వే అధికారులు వెంటనే ఇతర రైళ్లను ట్రాక్‌లపై నిలిపివేసి సమస్యను పరిష్కరించారు.
