అక్షరటుడే, వెబ్‌డెస్క్:Heavy Rains | కొండ చరియలు విరిగి పడటంతో ముగ్గురు సైనికులు(Soldiers) మృతి చెందారు. ఈ ఘటన సిక్కిం(Sikkim) రాష్ట్రంలో చోటు చేసుకుంది.
గత కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు (Heavy Rains) సిక్కింలోని ఛటేన్ ప్రాంతంలో మిలిటరీ క్యాంప్(Military camp)పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించగా.. మరో ఆరుగురు గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలను బలగాలు గుర్తించాయి. ఈ ప్రమాదం నుంచి మరో నలుగురు సిబ్బంది బయటపడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.
Heavy Rains | రెడ్ అలెర్ట్ జారీ
ఈశాన్య రాష్ట్రాల్లో సోమవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు రెడ్ అలెర్ట్(Red Alert) జారీ చేశారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపుర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్‌లో అతి భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ప్రభావం, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వానల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.