Homeజిల్లాలుకామారెడ్డిBanswada | దాడి కేసులో ముగ్గురికి రెండేళ్ల జైలు

Banswada | దాడి కేసులో ముగ్గురికి రెండేళ్ల జైలు

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | క్షుద్రపూజల నెపంతో ఇద్దరిపై దాడికి పాల్పడిన కేసులో ముగ్గురికి న్యాయస్థానం రెండేళ్ల జైలుశిక్ష విధించినట్లు వర్ని ఎస్సై మహేశ్‌ (varni SI Mahesh) తెలిపారు. వర్ని మండలం సిద్దాపూర్‌ తండాకు చెందిన మానిక్‌ చంద్, పద్మ క్షుద్రపూజలు చేస్తున్నారన్న కారణంతో అదే గ్రామానికి చెందిన దౌలత్‌ రావు, సరిచంద్, శంకర్‌ వారిపై దాడి చేశారు. దీంతో అప్పటి ఎస్సై అంజయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో బోధన్‌ కోర్టు అడిషనల్‌ జడ్జి సాయిశివ మంగళవారం ముగ్గురు ముద్దాయిలకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్సై తెలిపారు.

Must Read
Related News