Homeజిల్లాలునిజామాబాద్​Drunk drive | డ్రంక‌న్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలుశిక్ష‌

Drunk drive | డ్రంక‌న్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలుశిక్ష‌

మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డిపిన కేసులో ముగ్గురికి న్యాయ‌స్థానం జైలుశిక్ష విధించింది. ఈ మేరకు ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్ష‌ర‌టుడే, నిజామాబాద్ సిటీ: Drunk drive | మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డిపిన కేసులో న్యాయ‌స్థానం ముగ్గురికి జైలుశిక్ష విధించింది. ట్రాఫిక్ ఏసీపీ మ‌స్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. న‌గ‌రంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా.. ఏడుగురు మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డుపుతూ (drunk drive) పోలీసుల‌కు చిక్కారు.

వారికి కౌన్సెలింగ్ నిర్వ‌హించి మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) నూర్జ‌హాన్ ఎదుట హాజ‌రుప‌ర్చారు. ఇందులో న‌లుగురికి రూ. 45,000 జ‌రిమానా విధించారు. అలాగే ముగ్గురికి వారం రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. ఈ సంద‌ర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మ‌స్తాన్ అలీ మాట్లాడుతూ.. స‌వ‌రించిన మోటార్ వాహ‌న చ‌ట్టం ప్ర‌కారం మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డిపితే రూ.10వేల జ‌రిమానా విధిస్తామ‌ని తెలిపారు.

Must Read
Related News