Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | ముగ్గురు గడ్డిమందు తాగిన ఘటన.. మరొకరు మృతి

Nizamabad City | ముగ్గురు గడ్డిమందు తాగిన ఘటన.. మరొకరు మృతి

నగరంలో గడ్డిమందు తాగిన ఘటనలో మరొకరు మృతి చెందారు. నగరంలోని శివాజీనగర్​లో మూడురోజుల క్రితం ఒకరు అదేరోజు మృతిచెందగా మరొకరు శనివారం ప్రాణాలు విడిచారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City| నగరంలోని శివాజీనగర్​లో (Shivajinagar) ముగ్గురు కుటుంబ సభ్యులు గడ్డిమందు తాగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది.

స్పందించిన స్థానికులు వెంటనే ఈ ముగ్గురికి నగరంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి (private hospital) తరలించారు. అక్కడ ఇంటిపెద్ద దాసరి కిషన్​ మృతి చెందాడు. ఆయన భార్య నాగమణి, కొడుకు వంశీని హైదరాబాద్​లోని (Hyderabad) నిమ్స్​కు రిఫర్​ చేశారు.

Nizamabad City | చికిత్స పొందుతూ..

అయితే చికిత్స పొందుతున్న ఇద్దరిలో కొడుకు వంశీ శుక్రవారం మృతి చెందాడు. తల్లి సైతం వెంటిలేటర్​పై చికిత్స పొందుతోందని స్థానికులు పేర్కొన్నారు. ఇంట్లో గొడవల కారణంగా కొడుకు ముందుగా గడ్డిమందు తాగగా.. తల్లీతండ్రి సైతం మందు తాగారని స్థానికులు వివరించారు.