ePaper
More
    Homeఅంతర్జాతీయంMali Country | మాలీలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. రంగంలోకి దిగిన విదేశాంగ శాఖ‌

    Mali Country | మాలీలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. రంగంలోకి దిగిన విదేశాంగ శాఖ‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mali Country | మాలిలో ముగ్గురు భార‌తీయులు కిడ్నాప్‌కు (Three Indians kidnapped) గుర‌య్యారు. వారిని సుర‌క్షితంగా తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ రంగంలోకి (Ministry of External Affairs) దిగింది.

    మాలి అధికారుల‌తో దీనిపై ఇప్ప‌టికే చర్చ‌లు ప్రారంభించింది. మాలిలో భార‌తీయుల అప‌హ‌ర‌ణ‌పై ఏ సంస్థ కూడా ఇప్ప‌టికీ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. మ‌రోవైపు, మాలి అంతటా సమన్వయంతో జరిగిన దాడులకు మాత్రం ఆల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (JNIM) బాధ్యత వహించింది.

    Mali Country | నిరంతర సంప్ర‌దింపులు..

    కిడ్నాప్‌కు గురైన ఇండియ‌న్ల‌ను సుర‌క్షితంగా తీసుకువ‌చ్చేందుకు విదేశాంగ శాఖ చ‌ర్య‌లు చేపట్టింది. మాలి రాజ‌ధాని బమాకోలోని (Mali capital Bamako) భారత రాయబార కార్యాలయం (Indian Embassy) అధికారులతో నిరంతరం’ సంప్రదింపులు జరుపుతోంది. స్థానిక అధికారుల‌తో పాటు డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ (Diamond Cement factory) నిర్వాహ‌కుల‌తో నిరంతరం ట‌చ్‌లో ఉన్నామ‌ని విదేశాంగ తెలిపింది. మ‌రోవైపు, అపహరణకు గురైన భారతీయుల కుటుంబ సభ్యులతో కూడా ఇది సంప్రదింపులు జరుపుతోంది.

    “ఈ దారుణమైన హింసాత్మక చర్యను భారత ప్రభుత్వం (Government of India) నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది. కిడ్నాప్‌కు గురైన భారతీయ పౌరులను సురక్షితంగా, త్వరగా విడుదల చేయించ‌డానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని కోరుతోంది” అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సీనియర్ అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, భారతీయ పౌరులను త్వరగా విడుదల చేయడానికి వివిధ స్థాయిలలో నిమగ్నమై ఉన్నారని వివ‌రించింది.

    ప్రస్తుతం మాలిలో నివసిస్తున్న భారతీయ పౌరులందరూ (Indian nationals) అత్యంత అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ అడ్వైజ‌రీ జారీ చేసింది. క్రమం తప్పకుండా వ‌చ్చే స‌ల‌హాలు పాటించాల‌ని, అవసరమైన సహాయం కోసం బమాకోలోని (Bamako) రాయబార కార్యాలయంతో ట‌చ్‌లో ఉండాల‌ని సూచించింది. భారతీయులకు సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని. కిడ్నాప్‌కు గురైన మ‌న పౌరులను వీలైనంత త్వరగా సురక్షితంగా తిరిగి వచ్చేలా చూసుకోవడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.

    More like this

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...