Homeజిల్లాలుకామారెడ్డిYellareddy Hospital | ఎల్లారెడ్డి ఆస్పత్రిలో వైద్యుల నియామకంపై హర్షం

Yellareddy Hospital | ఎల్లారెడ్డి ఆస్పత్రిలో వైద్యుల నియామకంపై హర్షం

- Advertisement -

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy Hospital | పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు గైనకాలజిస్ట్​ల నియామకంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆస్పత్రిలో స్త్రీ వైద్య నిపుణుల కొరతతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు (MLA Madanmohan Rao) ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆస్పత్రిలో గైనకాలజిస్టుల (gynecologists) కొరతతో గర్భిణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. వెంటనే వైద్యులను నియమించి, ఇబ్బందులు తీర్చాలని సమావేశంలో అధికారులను కోరారు. దీంతో ఎమ్మెల్యే ఆదేశాలతో కలెక్టర్, డీఎంహెచ్‌వో స్పందించి ముగ్గురు గైనకాలజిస్టులను డిప్యూటేషన్‌పై నియమించారు.

ఈనెల 23న తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఉత్తర్వులు (Telangana Medical Policy Council) జారీ చేసింది. ఇందులో భాగంగా దోమకొండ ఆస్పత్రి వైద్యురాలు సరిత ప్రతి సోమ, మంగళవారాల్లో ఎల్లారెడ్డి ఆస్పత్రిలో సేవలందిస్తారు. అలాగే మద్నూర్‌ ఆస్పత్రి వైద్యురాలు పిట్లవార్‌ స్వప్నాలి బుధ, గురువారాల్లో, డా ఎక్లారే కపిల్‌ శివరాజ్‌ శుక్ర, శనివారాల్లో విధులు నిర్వహించనున్నారు.

ఈ మేరకు ఆయా వారాల్లో ఆస్పత్రిలో అందుబాటులో ఉంటూ, గర్భిణులకు వైద్య సేవలు అందించేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారు. దీంతో ఎల్లారెడ్డి మండల (Yellareddy mandal) పరిధిలోని గర్భిణులకు స్థానికంగా గైనకాలజీ సేవలు అందనున్నాయి. ఇదివరకు ఇతర మండలాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై సమస్య తీరనుంది. ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్‌ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు, మాజీ ఛైర్మన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News