అక్షర టుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఎవరికైనా ప్రభుత్వ కొలువు (government job) అనేది కల. అలాంటిది ఒక్కరికే మూడు కొలువులు వస్తే వారి ఆనందానికి అంతే ఉండదు. అతనే కొండూర్ గ్రామానికి (Kondur village) దండు సంతోష్‌కుమార్.
పెద్ద వాల్గోట్‌లో స్థిరపడిన దండు శివకుమార్– జ్యోతి దంపతులకు కుమారుడైన దండు సంతోష్ కుమార్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య (primary education) అనంతరం, పోచంపాడ్ గురుకుల పాఠశాలలో (Pochampad Gurukul School) ఉన్నత విద్య పూర్తి చేశాడు. అత్యుత్తమ మార్కులు సాధించడంతో, ఎన్‌ఆర్‌ఐ అకాడమీలో ఇంటర్ విద్య ఉచితంగా చదివాడు. ఇంజినీరింగ్ అనంతరం ప్రభుత్వ కొలువు సాధించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ మేరకు సొంతంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవగా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో కస్టమ్ ఆఫీసర్‌గా మొదటి ఉద్యోగం పొందాడు. ఆ తర్వాత ఆడిట్ ఆఫీసర్‌గా జాబ్ సాధించాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షల్లో రాష్ట్రంలోనే 8వ ర్యాంక్, జోన్‌లో 3వ ర్యాంక్ సాధించి ఉద్యోగం పొందాడు. ప్రస్తుతం కామారెడ్డిలో గెజిటెడ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. సంతోష్‌కుమార్ తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాగా సోదరి సీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది.