Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం

Nizamabad City | ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం

నిజామాబాద్​ నగరంలోని కోటగల్లి పాఠశాల ఎస్సీ వసతి గృహం నుంచి అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యమైంది. వారు నిజామాబాద్​కు తరలిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని కోటగల్లి పాఠశాల లో గల ఎస్సీ వసతి గృ హం (SC hostel) నుంచి మిస్ అయిన ముగ్గురు అమ్మాయిలు ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం.

ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్​లో (Hyderabad), ఒక అమ్మాయి ఆచూకీ నాందేడ్​లో (Nanded) లభ్యమైనట్లు తెలిసింది. ఈ విషయమై ఇప్పటికే తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు సమాచారం. విద్యార్థులను నిజామాబాద్​కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా.. వెనకబడిన తరగతుల వసతిగృహానికి (backward classes hostel) చెందిన ముగ్గురు బాలికలు అదృశ్యమైన విషయం తెలిసిందే. పదో తరగతికి చదువుతున్న ఇద్దరు, తొమ్మిదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని హాస్టల్​ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వెంటనే వారు పోలీసులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు బాలికలను గుర్తించారు.