HomeUncategorizedAir India | సాంకేతిక సమస్యలతో మూడు విమానాలు రద్దు

Air India | సాంకేతిక సమస్యలతో మూడు విమానాలు రద్దు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | సాంకేతిక సమస్యతో ఇటీవల అహ్మదాబాద్​లో ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయిన (Ahmedabad Plane Crash) విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 274 మంది మరణించారు. ఈ ఘటనను మరువకముందే ఎయిర్​ ఇండియా (Air India) విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వరుస ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం సాంకేతిక సమస్యలతో మూడు ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసులు రద్దు చేశారు.

మెయింటెనెన్స్‌, సాంకేతిక లోపాలతో సర్వీసులు రద్దు చేసినట్లు ఎయిర్​ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు విమానం ఎక్కిన తర్వాత రెండు విమానాలు రద్దు చేయడం గమనార్హం. అర్ధంతరంగా విమానాలు రద్దు అవుతుండటంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్లాల్సిన ఎయిర్​ ఇండియా విమానం మంగళవారం సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఉత్తర ప్రదేశ్​ నుంచి కోల్​కతా వెళ్లాల్సిన విమానం సైతం టేకాఫ్​ ముందు టెక్నికల్​ ప్రాబ్లెమ్స్​తో ఆగిపోయింది. వరుసగా ఎయిర్​ ఇండియా విమానాల్లో సమస్యలు తలెత్తుతుండడంతో ప్రయాణికులు (Passengers) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణం కోసం గంటల ముందు ఎయిర్​ పోర్టు (Airport)కు వస్తున్నామని.. తీరా ఫ్లైట్​ రద్దు అవ్వడంతో అవస్థలు పడుతున్నామని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే విమానాన్ని తనిఖీ చేయాలని సూచిస్తున్నారు.