Homeబిజినెస్​Stock Market | మూడు రోజుల నష్టాలకు తెర.. లాభాలతో ముగిసిన సూచీలు

Stock Market | మూడు రోజుల నష్టాలకు తెర.. లాభాలతో ముగిసిన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock market) కోలుకుంది. మంగళవారం బెంచ్‌మార్క్‌ సూచీలు బలంగా పుంజుకున్నాయి. దీంతో వరుస నష్టాలకు బ్రేక్‌ పడిరది. ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్‌ 850 పాయింట్లకుపైగా పైకి ఎగసింది. నిఫ్టీ 24,800 పాయింట్లపైన నిలబడిరది. ఉదయం సెన్సెక్స్‌ 271 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. స్వల్ప ఒడిదుడుకుల మధ్య మధ్యాహ్నం 12 గంటల వరకు సెన్సెక్స్‌ 80,575 నుంచి 80,990 పాయింట్ల మధ్య, నిఫ్టీ(Nifty) 24,598 నుంచి 24,727 పాయింట్ల మధ్య కదలాడాయి.

ఆ తర్వాత స్టాక్‌ మార్కెట్లు పరుగులు తీశాయి. ఇంట్రాడే(Intraday) కనిష్టాలనుంచి సెన్సెక్స్‌ 854 పాయింట్లు, నిఫ్టీ 249 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్‌ 446 పాయింట్ల లాభంతో 81,337 వద్ద, నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 24,821 వద్ద స్థిరపడ్డాయి. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌(Sensex), నిఫ్టీలు 2 శాతానికిపైగా నష్టపోయాయి. ఈ క్రమంలో కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో మంగళవారం సూచీలు లాభాలబాటపట్టాయి. మధ్యాహ్నం తర్వాత ఆసియాలోని షాంఘై, కోస్పీ మార్కెట్లు సైతం లాభాలబాట పట్టడం మన ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది.

బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 2,482 కంపెనీలు లాభపడగా 1,521 స్టాక్స్‌ నష్టపోయాయి. 154 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 118 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 93 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. మూడు సెషన్లలోనే సెన్సెక్స్‌ 2.2 శాతం, నిఫ్టీ ఫిఫ్టీ 2.1 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీల విలువ రూ. 2.75 లక్షల కోట్లకుపైగా పెరిగింది.

Stock Market | అన్ని రంగాలూ గ్రీన్‌లోనే..

కనిష్ట స్థాయిల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో అన్ని రంగాల సూచీలు పాజిటివ్‌గా ముగిశాయి. బీఎస్‌ఈ రియాలిటీ ఇండెక్స్‌(Realty index) 1.63 శాతం, టెలికాం ఇండెక్స్‌ 1.53 శాతం లాభపడ్డాయి. ఎనర్జీ 1.27 శాతం, ఇండస్ట్రియల్‌ ఇండెక్స్‌ 1.26 శాతం, ఇన్‌ఫ్రా 1.17 శాతం, హెల్త్‌కేర్‌ 1.14 శాతం, కమోడిటీ 1.08 శాతం, ఆటో ఇండెక్స్‌ 1.04 శాతం పెరిగాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 1.12 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.85 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.72 శాతం లాభాలతో ముగిశాయి.

Stock Market | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 19 కంపెనీలు లాభాలతో, 11 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. రిలయన్స్‌ 2.21 శాతం, ఎల్‌అండ్‌టీ 2.13 శాతం, ఆసియా పెయింట్‌ 1.81 శాతం, అదాని పోర్ట్స్‌ 1.49 శాతం లాభాలతో ముగిశాయి.

Stock Market | Top losers..

టీసీఎస్‌ 0.73 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.64 శాతం, టైటాన్‌ 0.41 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.34 శాతం, ఐటీసీ 0.31 శాతం నష్టపోయాయి.