Homeతాజావార్తలుStock Markets | మూడు రోజుల నష్టాలకు తెర.. లాభాలతో ముగిసిన సూచీలు

Stock Markets | మూడు రోజుల నష్టాలకు తెర.. లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నూతన వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఒడిదుడుకుల మధ్య కొనసాగినా.. సెన్సెక్స్‌ 319 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు పెరిగాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock market)లో మూడు రోజుల నష్టాలకు తెరపడిరది. సోమవారం లాభాల బాటలో పయనించాయి. ఉదయం సెన్సెక్స్‌, నిఫ్టీ(Nifty)లు ఫ్లాట్‌గా ప్రారంభమైనా వెంటనే పుంజుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 83,197 నుంచి 83,754 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,503 నుంచి 25,653 పాయింట్ల మధ్యలో కదలాడాయి.

చివరికి సెన్సెక్స్‌(Sensex) 319 పాయింట్ల లాభంతో 83,535 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 25,574 వద్ద స్థిరపడ్డాయి. యూఎస్‌ గవర్నమెంట్‌ షట్‌డౌన్‌(US govt shutdown)ను ఎత్తేసేందుకు చట్టసభల సభ్యులు ఒక ఒప్పందానికి రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడి గ్లోబల్‌ మార్కెట్లు ర్యాలీ తీశాయి. దీంతో మన మార్కెట్లు సైతం పెరిగాయి. ఐటీ షేర్లు రాణించాయి. ఇన్ఫోసిస్‌(Infosys), హెచ్‌సీఎల్‌ టెక్‌ స్టాక్స్‌ రెండు శాతానికిపైగా పెరిగాయి.

Stock Markets | రాణించిన ఐటీ, మెటల్‌ స్టాక్స్‌..

ఐటీ, మెటల్‌(Metal) సెక్టార్ల స్టాక్స్‌ రాణించాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 1.66 శాతం పెరగ్గా.. క్యాపిటల్‌ గూడ్స్‌ 1.24 శాతం, ఇండస్ట్రియల్‌ 0.66 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ 0.62 శాతం, మెటల్‌ ఇండెక్స్‌ 0.51 శాతం, ఎనర్జీ 0.36 శాతం లాభపడ్డాయి. ఇన్‌ఫ్రా(Infra) ఇండెక్స్‌ 0.39 శాతం, యుటిలిటీ 0.36 శాతం, రియాలిటీ 0.29 శాతం, సర్వీసెస్‌ 0.25 శాతం, ఎఫ్‌ఎంసీజీఈ ఇండెక్స్‌ 0.11 శాతం పడిపోయాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.28 శాతం పడిపోగా మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.62 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం పెరిగాయి.

Stock Markets | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,962 కంపెనీలు లాభపడగా 2,372 స్టాక్స్‌ నష్టపోయాయి. 179 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 193 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 199 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Stock Markets | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 18 కంపెనీలు లాభాలతో ఉండగా.. 12 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్‌ 2.52 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.76 శాతం, ఆసియా పెయింట్‌ 1.28 శాతం, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ 1.20 శాతం లాభపడ్డాయి.

Stock Markets | Top losers..

ట్రెంట్‌ 7.41 శాతం, ఎటర్నల్‌ 1.49 శాతం, పవర్‌గ్రిడ్‌ 1.36 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.85 శాతం, ఎంఅండ్‌ఎం 0.77 శాతం నష్టపోయాయి.

Must Read
Related News