అక్షరటుడే, లింగంపేట : Lingampet | లింగంపేట మండలం భవానిపేట గ్రామ (Bhawanipet village) శివారులో కరెంట్ షాక్‌తో (electric shock) మూడు గేదెలు మృతి చెందినట్లు లైన్‌మన్ పాండు తెలిపారు.
మాదిగ బాలయ్య పొలం వద్ద బోరు మోటార్‌కు సంబంధించిన సర్వీస్ వైరు తెగిపోయి ఫినిషింగ్ వైర్‌పై పడింది. ఆ వైరుకు విద్యుత్ సరఫరా కావడంతో ప్రమాదవశాత్తు దానికి తాకిన గేదేలు మృతి చెందాయి. ఆకుల సురేందర్ , గుండ్ర సత్యనారాయణ, గుండ్ర పరందాములు గేదెలు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. రూ.3 లక్షల మేర నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.