Homeజిల్లాలుకామారెడ్డిNizamabad City | వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్‌

Nizamabad City | వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్‌

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | నిజామాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు వన్‌ టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపారు.

జగిత్యాల (Jagityala) జిల్లా చిలకలవాడకు చెందిన షేక్‌ యామిన్, గోపి, ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా తాటిగూడ రైల్వేస్టేషన్‌కు చెందిన సయ్యద్‌ ఫారూక్‌ ముగ్గురు కలిసి 20కు పైగా కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరికి మహారాష్ట్రకు (Maharastra) చెందిన సత్యతో పరిచయం కాగా, ఈ నలుగురు కలిసి బాసరలో అద్దెకు ఉంటూ.. నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు.

శనివారం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో పార్క్‌ చేసిన బైక్‌ దొంగిలించి, అదే బైక్‌పై వెళ్లి తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీకి పాల్పడేందుకు వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వారిని పట్టుకుని విచారించగా, గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు వారి వద్ద నుంచి రూ.5వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు, టీవీ, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు సత్య పరారీలో ఉన్నట్లు ఎస్‌హెచ్‌వో చెప్పారు.

Must Read
Related News