అక్షరటుడే నిజామాబాద్ సిటీ :Nizamabad City | వేల్పూర్, ఆర్మూర్ ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు(Excise Police) అరెస్టు చేశారు. ఎక్సైజ్ సీఐ వెంకటేష్(Excise CI Venkatesh) తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి వేల్పూర్ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 750 గ్రాముల గంజాయి, బైకు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో తనిఖీలు చేపట్టి గంజాయి విక్రయిస్తున్న షేక్ సమీర్, షేక్ కలీమ్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి 2.3 కిలోల గంజాయితోపాటు రెండు బైకులు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్సై నరసింహ చారి, సిబ్బంది భూమన్న, గంగారాం, విష్ణు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Nizamabad City | గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
5