అక్షరటుడే, ఆర్మూర్: Armoor | లాడ్జ్‌లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి (Armoor Police) తీసుకున్నారు. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ (Armoor SHO Satyanarayana) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఉన్న మమత లాడ్జ్‌లో వ్యభిచారం జరుగున్నట్లుగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేశారు.
అక్కడ ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విటులకు గదులు కేటాయించిన లాడ్జ్ యజమానిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. అనంతరం వారందరిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో వెల్లడించారు.
