అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వీక్లీ మార్కెట్లో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి బైక్ పత్రాలు చూపించాలని కోరగా వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నగరంలోని హనుమాన్ నగర్‌కు చెందిన గాజాబారే నగేష్, న్యాల్కల్ రోడ్‌కు చెందిన హన్మంతే మోహన్‌ను కలిసి మహాలక్ష్మి హాస్పిటల్ (Mahalaxmi Hospital) నుంచి బైక్‌ను చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. అలాగే జీజీహెచ్‌లో (Nizamabad GGH) ఓ బైక్‌ను చోరీ చేసినట్లు చెప్పారు. వినాయక్ నగర్‌కు చెందిన షేక్ గౌస్ అనే వ్యక్తికి అమ్మేసినట్లు తెలిపారు. అలాగే ఆర్యనగర్‌లో ఒక టీవీఎస్ ఎక్సెల్‌ను, వీక్లీ మార్కెట్లో మరొక బైక్‌ను చోరీ చేసినట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ వద్ద చెట్లపొదల్లో దాచినట్టు పోలీసులకు తెలిపారు. వారు చెప్పిన సమాచారంతో మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. వీరితో పాటు షేక్ గౌస్‌ను కూడా పట్టుకొని అతని వద్ద నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

