అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | పోలీసులమని బెదిరించి వసూళ్లకు పాల్పడిన ముగ్గురిని దేవునిపల్లి పోలీసులు (Devunipalli Police) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజంపేట మండల కేంద్రానికి చెందిన జింక భాస్కర్ అతని స్నేహితులు నవీన్ గౌడ్, లక్ష్మణ్‌తో కలిసి చిన్న మల్లారెడ్డి శివారులోని ఎల్లమ్మ దేవాలయం (Yellamma Temple) వద్ద పోలీసులని చెప్పి ఒక వ్యక్తి నుంచి రూ.1,800, ఒక మొబైల్ ఫోన్ ను బెదిరించి బలవంతంగా లాక్కున్నారు. దాంతో బాధితుడు దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల విచారణలో రాజాంపేట (Rajampet)కు చెందిన భాస్కర్, నవీన్ గౌడ్, లక్ష్మణ్‌లు పోలీసుల పేరుతో బెదిరించినట్లు తేలింది. గురువారం సాయంత్రం సరంపల్లి ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న తెల్ల రంగు హ్యుందాయ్ క్రెటా కారును పోలీసులు ఆపారు. దీంతో డ్రైవర్ జింక భాస్కర్ పారిపోవడానికి ప్రయత్నించగా.. అతనితో పాటు లక్ష్మణ్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. నవీన్ గౌడ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితుల నుంచి మొబైల్ ఫోను, కారు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖ (Police Department)
ఎల్లప్పుడూ ప్రజల భద్రతకు అప్రమత్తంగా ఉందన్నారు. ఎలాంటి అక్రమాలు, బెదిరింపులు, దోపిడీలు జరిగినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
1 comment
[…] నాయకులు పేర్కొన్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలో శుక్రవారం జరుగనున్న […]
Comments are closed.