Homeక్రైంJeedimetla | మావోయిస్టుల పేరిట బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్​

Jeedimetla | మావోయిస్టుల పేరిట బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jeedimetla | మావోయిస్టుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరిని జీడిమెట్ల పోలీసులు (Jeedimetla Police) అదుపులోకి తీసుకున్నారు.

జీడిమెట్ల పోలీస్​ స్టేషన్​ పరిధిలోని షాపూర్​నగర్ (shapoor nagar)​లో ఇటీవల కుత్బుల్లాపూర్​ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ (kuna srisailam goud)​ అన్న కుమారుడిని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. రూ.50 లక్షలు ఇవ్వకపోతే ఆయన ఇళ్లను పేల్చేయడంతో పాటు చంపేస్తామని మావోయిస్టుల పేరిట రాసి ఉన్న లేఖను రాఘవేందర్ కారుపై పెట్టి వెళ్లారు.

దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని గన్నవరం(Gannavaram) ప్రాంతానికి చెందిన ఎర్రంశెట్టి రాజు, కందురెళ్లి రాజు ఈ లేఖ రాసినట్లు వారు గుర్తించారు.

షాపూర్​నగర్​లో నివాసం ఉంటున్న వీరు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులను మావోయిస్టుల పేరిట బెదిరించి డబ్బులు డిమాండ్​ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాఘవేందర్​ గౌడ్​ ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు. వారి నుంచి 13 నాటు బాంబులు, నాలుగు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.