More
    Homeక్రైంCyber Fraud | డిజిటల్​ అరెస్ట్​ పేరిట బెదిరింపులు.. హార్ట్​ ఎటాక్​తో రిటైర్డ్​ డాక్టర్​ మృతి

    Cyber Fraud | డిజిటల్​ అరెస్ట్​ పేరిట బెదిరింపులు.. హార్ట్​ ఎటాక్​తో రిటైర్డ్​ డాక్టర్​ మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Fraud | సైబర్​ నేరగాళ్ల బెదిరింపులకు ఓ మహిళ బలైపోయింది. డబ్బుల కోసం డిజిటల్​ అరెస్ట్​ (digital arrest) అంటూ వారు ఫోన్​ చేయడంతో రిటైర్డ్​ డాక్టర్​కు గుండెపోటు (heart attack) వచ్చింది.

    సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్తకొత్త దారుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్​ పేరిట భయపెట్టి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ 76 ఏళ్ల రిటైర్డ్​ డాక్టర్​ (retired doctor) వారి బెదిరింపులకు భయపడి గుండెపోటుతో మృతి చెందింది. మూడు రోజుల పాటు సైబర్​ నేరగాళ్లు వేధించడంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

    Cyber Fraud | ఆందోళన చెందడంతో..

    హైదరాబాద్​కు (Hyderabad) చెందిన ఓ మహిళ చీఫ్ సీనియర్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించి రిటైర్డ్​ అయింది. సెప్టెంబర్​ 5న ఆమెకు సైబర్​ నేరగాళ్లు ఫోన్​ చేశారు. తాము బెంగళూరు పోలీసులమని చెప్పారు. మానవ అక్రమ రవాణా కేసులో నిందితులు సదరు వైద్యురాలి ఆధార్​కార్డు (Aadhaar card), ఇతర వివరాలు వినియోగించారని చెప్పి బెదిరించారు.

    సెప్టెంబర్​ 8 వరకు ఆమెకు నిత్యం వీడియో కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. పలు విభాగాల అధికారుల పేరిట ఫోన్లు చేసి డిజిటల్​ అరెస్ట్​ చేశామని చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె తన ఖాతా నుంచి వారికి రూ.6.6 లక్షలు విడతల వారిగా బదిలీ చేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్​ 8న ఆమెకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్​కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

    Cyber Fraud | ఫోన్​ చెక్​ చేయడంతో..

    రిటైర్డ్​ డాక్టర్​ మృతి చెందిన అనంతరం ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఫోన్​ చెక్ చేయడంతో సైబర్​ క్రైమ్​ బయట పడింది. సైబర్‌ నేరగాళ్ల బెదిరింపులతోనే ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆమె చనిపోయిన తర్వాత కూడా సైబర్​ నేరస్తుల నుంచి సందేశాలు వస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

    Cyber Fraud | అప్రమత్తంగా ఉండాలి

    సైబర్​ నేరాలపై (Cyber Frauds) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అలాగే ఎవరైనా ఫోన్​ చేసి తాము పోలీసులం, సీబీఐ ​ అధికారులమని (CBI Officers) చెప్పి బెదిరిస్తే భయపడకుండా ఉండాలన్నారు. అధికారులు అలా ఫోన్లు చేయరని చెప్పారు. అలాంటి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయవద్దన్నారు. ఎవరైనా అలా ఫోన్​ చేస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్​ 1930కి సమాచారం అందించాలని సూచించారు.

    More like this

    Kamareddy | కబ్జాదారులకు సీఐ అండగా నిలుస్తున్నారని ఎస్సీ కమిషన్​కు ఫిర్యాదు!

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలో ఓ సీఐ తీరు వివాదాస్పదంగా మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు సీఐ...

    TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. డిసెంబర్​ దర్శన కోటా టికెట్ల విడుదల ఎప్పుడంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD | శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూసే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన...

    Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా మినీ ట్యాంక్ బండ్‌ను తీర్చిదిద్దాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా నగరంలోని ఖిల్లా రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్​ను...