అక్షరటుడే, వెబ్‌డెస్క్: Journalist : రాత్రివేళల్లో ఇసుక తరలిస్తున్న వారిని విలేకరిని అంటూ డబ్బులు డిమాండ్ చేసిన ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లా ధర్పల్లి మండలం (Dharpalli mandal) లో చోటుచేసుకుంది. సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ధర్పల్లి ఎస్సై కళ్యాణి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన వ్యక్తికి పొక్లెయిన్, ట్రాక్టర్ ఉన్నాయి. ఈయన సరైన అనుమతులతో ఇందిరమ్మ ఇళ్ల కోసం మొరం తరలిస్తుండగా.. ధర్పల్లి మండలానికి చెందిన అల్లెపు రాజు అనే వ్యక్తి ప్రముఖ వార్తా పత్రిక విలేకరిని అని పరిచయం చేసుకున్నాడు.
Journalist : బలవంతంగా డబ్బులు వసూలు..
ఇసుక తవ్వేందుకు అనుమతి ఉందా..? అనుమతి పత్రాలు చూపండి.. పోలీసులకు ఫిర్యాదు చేసి, వాహనాలను సీజ్ చేయిస్తానని బెదిరించాడు. భవిష్యత్తులోనూ వాహనాలను అడ్డుకుంటానని చెప్పి, భయపెట్టి రూ. 10 వేలు వసూలు చేశాడు.
దీంతో బాధితుడు ఈ నెల (ఆగస్టు) 5న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ధర్పల్లి పోలీసులు (POLICE) కేసు నమెదు చేశారు. దర్యాప్తు చేపట్టి, నిందితుడిని శుక్రవారం రిమాండ్కు తరలించారు.