అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | ఇంటికి వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి నిలువు దోపిడీకి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బైక్పై ఎక్కిన వయ్యారి భామ.. మరో ఇద్దరితో కలిసి, మధ్యలో వాహనం ఆపి రూ.28 వేలు దోచుకుంది.
కామారెడ్డి పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలోనే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఆడిన నాటకంలో ఓ వ్యక్తి నిలువు దోపిడీకి గురయ్యాడు. ఉన్నదంతా పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు.
కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండలం చింతమానుపల్లి గ్రామానికి చెందిన చిన్న గంగయ్య పని నిమిత్తం కామారెడ్డికి వచ్చారు. పట్టణంలోని దుబ్బ గౌడ్ కల్లు దుకాణంలోకి వెళ్లారు.
Kamareddy | మాటలు కలిపి..
అక్కడ ఇద్దరు మహిళలు ఆయనతో మాటలు కలిపారు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే.. చింతమాన్పల్లికి వెళ్తున్నట్లు అతను చెప్పారు. దీంతో తాను కూడా అటువైపే వెళ్లాలని, లిఫ్ట్ ఇవ్వమని అందులో ఒక మహిళ అడగడంతో సరేనని, ఆమెను గంగయ్య బండిపై ఎక్కించుకున్నారు.
Kamareddy | పక్కా ప్రణాళిక ప్రకారం మార్గమధ్యలో..
అలా బైకుపై వెళ్తుండగా మార్గమధ్యలో ఆ మహిళ Woman బైక్ Bike ఆపమని చెప్పింది. బండి ఆపిన వెంటనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకడు తన భార్యను వెహికల్పై ఎందుకు ఎక్కించుకున్నావని గొడవ పడ్డాడు.
తన భార్యతో నీకు సంబంధం ఏమిటని బెదిరించి, గంగయ్య వద్ద ఉన్న రూ.28 వేల నగదు, పర్సు లాగేసుకున్నారు. ఉన్నదంతా కొల్లగొట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కామారెడ్డి kamareddy పట్టణ పోలీసులు Police కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.
Kamareddy | ముక్కూ ముఖం తెలియని వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని..
ముక్కూ ముఖం తెలియని వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు Police సూచిస్తున్నారు. ఎవరికి పడితే వారికి లిఫ్ట్ lift ఇచ్చి చిక్కుల్లో పడొద్దని హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద మొత్తంలో నగదు వెంట తీసుకెళ్లొద్దంటున్నారు.