అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | ప్లాస్టిక్ వాడకంతో జరుగుతున్న అనర్థాలను వివరించేందుకు ఎల్లారెడ్డిలో ’స్వచ్ఛ యాత్ర’ (Swachh Yatra) నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు శనివారం స్వచ్ఛయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బస్టాండ్ (Yellareddy RTC Bus stand) ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ (Plastic wastage) వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చికెన్ సెంటర్ల నిర్వాహకులు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్లాస్టిక్ వాడకం నిలిపిన వ్యాపారులను సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే ఆర్టీసీ డీఎంతో మాట్లాడారు. ఎల్లారెడ్డి బస్టాండ్లో పరిసరాల శుభ్రత, శానిటేషన్ కార్యకలాపాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బస్టాండ్లోని మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
Mla Madan Mohan | ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం..
బస్సుల్లో ప్రయాణికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న అనర్థాలను వారికి వివరించారు. ఎల్లారెడ్డిని ఉత్తమ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. అనంతరం హైవే నిర్మాణం కారణంగా తొలగించబడనున్న శివాజీ మహారాజ్ విగ్రహాన్ని సందర్శించి, ఆ విగ్రహాన్ని తగిన ప్రదేశంలో తిరిగి ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే విగ్రహ పరిసరాల్లో రూ.15 లక్షల మున్సిపల్ నిధులతో అభివృద్ది పనులు చేపడతామని అవసరమైతే తన వ్యక్తిగత నిధులతోనే విగ్రహ పునఃప్రతిష్ఠ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీని (Yellareddy Municipality) దేశంలోనే అత్యంత శుభ్రత కలిగిన పట్టణంగా, ఇండోర్ నగరాన్ని మించి ఇండియాలో నంబర్–1 స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
