Operation Kagar | చిక్క‌డు.. దొర‌క‌డు.. పోలీసుల‌కు చుక్క‌లు చూపిస్తున్న హిడ్మా

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Kagar | ఆప‌రేష‌న్ కగార్ పేరిట భ‌ద్ర‌లా బ‌ల‌గాలు దండ‌కారాణ్యాన్ని జ‌ల్లెడ ప‌డుతున్నాయి. మావోల ఏరివేత ల‌క్ష్యంగా ఛత్తీస్‌గ‌డ్ (Chhattisgarh) స‌రిహ‌ద్దుల్లో వేలాది బ‌ల‌గాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్ర‌మంలో వ‌రుస ఎన్‌కౌంట‌ర్లు చోటు చేసుకుంటున్నాయి. అయితే, వంద‌లాది మందిని హ‌త‌మారుస్తున్నా కీల‌క నేత‌ల‌ను మ‌ట్టుబెట్టేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏ మాత్రం ఫ‌లించ‌ట్లేదు. చిక్కిన‌ట్లే చిక్కి త‌ప్పించుకు పోతుండ‌డంతో పోలీసులు(Police) త‌లలు ప‌ట్టుకుంటున్నారు. ప్ర‌ధానంగా మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు, మోస్ట్ వాంటెడ్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Kagar | ఆప‌రేష‌న్ కగార్ పేరిట భ‌ద్ర‌లా బ‌ల‌గాలు దండ‌కారాణ్యాన్ని జ‌ల్లెడ ప‌డుతున్నాయి. మావోల ఏరివేత ల‌క్ష్యంగా ఛత్తీస్‌గ‌డ్ (Chhattisgarh) స‌రిహ‌ద్దుల్లో వేలాది బ‌ల‌గాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్ర‌మంలో వ‌రుస ఎన్‌కౌంట‌ర్లు చోటు చేసుకుంటున్నాయి.

అయితే, వంద‌లాది మందిని హ‌త‌మారుస్తున్నా కీల‌క నేత‌ల‌ను మ‌ట్టుబెట్టేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏ మాత్రం ఫ‌లించ‌ట్లేదు. చిక్కిన‌ట్లే చిక్కి త‌ప్పించుకు పోతుండ‌డంతో పోలీసులు(Police) త‌లలు ప‌ట్టుకుంటున్నారు. ప్ర‌ధానంగా మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు, మోస్ట్ వాంటెడ్ మాద్వి హిడ్మా(Madvi Hidma) పోలీసుల‌కు చుక్క‌లు చూపుతున్నాడు. ఎన్ని ఎత్తులు వేసినా, వేలమంది వెంటాడుతున్నా చిక్కకుండా త‌ప్పించుకుంటూ స‌వాల్ విసురుతున్నాడు.

Operation Kagar | అంచెలంచెలుగా ఎదిగిన హిడ్మా

దాదాపు మూడు ద‌శాబ్దాల పాటు చ‌త్తీస్‌గ‌ఢ్ కేంద్రంగా ప‌ని చేస్తున్న హిడ్మా(Hidma)కు వ్యూహాలు ర‌చించ‌డంతో సిద్ధ‌హ‌స్తుడ‌న్న పేరుంది. 17 ఏళ్ల వ‌య‌స్సులోనే అజ్ఞాతంలోకి వెళ్లిన హిడ్మా.. మావోయిస్టు పార్టీ(Maoist Party)లో సాధార‌ణ కార్య‌క‌ర్త నుంచి నిర్ణయాత్మ‌క క‌మిటీ అయిన కేంద్ర క‌మిటీ వ‌ర‌కు ఎదిగాడు. న‌మ్మిన సిద్ధాంతం కోసం, పార్టీలో విశ్వాసం నింప‌డం కోసం కొత్త త‌ర‌హా ప్ర‌ణాళికలు రూపొందించాడు. ఈ క్ర‌మంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలకు మోస్ట్ వాంటెడ్‌(Most Wanted)గా మారాడు. నాలుగు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న అత‌ని త‌ల‌పై రూ.50 ల‌క్ష‌ల రివార్డు ఉంది.

Operation Kagar | గెరిల్లా యుద్ధ‌తంత్రాల‌కు పెట్టింది పేరు..

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పూవర్తి గ్రామంలో పుట్టిన హిడ్మా(Hidma) పోలీసుల కంట్లో న‌లుసుగా మారాడు. ఎంతో మంది బ‌ల‌గాల‌ను హ‌త‌మార్చ‌డం వెనుక అత‌ని మాస్ట‌ర్‌మైండ్ ఉంద‌ని చెబుతారు. వంద‌లాది మంది మిలిటెంట్ల‌ను గెరిల్లా యుద్ధ‌తంత్రంలో తీర్చిదిద్దాడు. 2011లో సుకుమా జిల్లాలో జ‌రిగిన చింత‌ల్నార్ దాడిలో దాదాపు 75 మంది సీఆర్‌పీఎఫ్(CRPF) జ‌వాన్లు హ‌త‌మార్చిన సంచ‌ల‌న ఘ‌ట‌న వెనుక హిడ్మా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. 2017లో బూర్క‌పాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉంద‌న్న విష‌యాన్ని మావోయిస్టు పార్టీయే స్వ‌యంగా ప్ర‌క‌టించింది. 2021లో తెర్రాం వద్ద 23 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను చంపడానికి స్కెచ్‌ వేసింది కూడా హిడ్మాయే.

Operation Kagar | టార్గెట్ హిడ్మా..

కొంత‌కాలంగా మావోయిస్టు(Maoist)ల‌పై బ‌ల‌గాల ఆధిప‌త్యం బాగా పెరిగిపోయింది. వ‌రుస ఎన్‌కౌంట‌ర్ల‌లో వంద‌లాది మంది హ‌త‌మ‌వ్వ‌డంతో కేడ‌ర్‌లో విశ్వాసం స‌న్న‌గిల్లింది. దండ‌కారాణ్యంలో ప‌ట్టున్న అనేక కీల‌క ప్రాంతాలు బ‌ల‌గాల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. నాలుగు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో పాగా వేసిన మావోల‌ను మట్టుబెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ క‌గార్‌(Operation Kagar)కు శ్రీ‌కారం చుట్టింది.

వ‌చ్చే మార్చి నాటికి న‌క్స‌ల్స్ స‌మ‌స్య‌ను అంత‌మొందించాల‌న్న ల‌క్ష్యం మేర‌కు బ‌ల‌గాలు దండకార‌ణ్యంపై దండెత్తాయి. మావోల‌కు కంచుకోట‌గా భావించే క‌ర్రెగుట్ట‌ల‌ను టార్గెట్ హిడ్మా(Target Hidma) పేరుతో 20వేల మందితో కూడిన‌ బ‌ల‌గాలు చుట్టుముట్టాయి. వెయ్యి మందికి పైగా మావోలు క‌ర్రెగుట్ట‌(Karre Gutta)ల్లో ఉన్నార‌న్న స‌మాచారం మేర‌కు ప‌ది రోజులుగా జ‌ల్లెడ ప‌ట్టాయి. అయితే, హిడ్మా తృటిలో త‌ప్పించుకుపోవ‌డంతో బ‌ల‌గాలు నిరాశ‌లో కూరుకుపోయాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...