అక్షరటుడే, వెబ్డెస్క్: Employees Leave | రాష్ట్రంలో శనివారం వేల సంఖ్యలో ఉద్యోగులు సెలవు పెట్టారు. దీంతో కార్యాలయాలు బోసిపోయాయి. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనూ (government schools) టీచర్లు సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ సెలవులు (Christmas holidays) మూడు రోజులు రావడంతో పాటు మధ్యలో ఒక రోజు లీవ్ పెడితే మరునాడు ఆదివారం దీంతో ఐదు రోజులు కలిసి వస్తుందనే ఉద్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఉద్యోగులు డ్యూటీకి లీవ్ పెట్టినట్లు సమాచారం.
Employees Leave | విహార యాత్రలకు..
క్రిస్మస్ సెలవులు మూడు రోజులు రాగా.. మధ్యలో శనివారం సెలవు పెడితే ఆదివారంతో ఐదు రోజులు కలిసి వచ్చింది. దీంతో చాలా మంది ఉద్యోగులు, టీచర్లు లీవ్ పెట్టి సొంతూళ్లు, విహారయాత్రలు, తీర్థయాత్రలకు వెళ్లారు. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు టూరిస్ట్ ప్లేస్లు పర్యాటకులతో కిటకిటలాడాయి. తిరుపతి, శ్రీశైలం (Tirupati and Srisailam), యాదగిరిగుట్ల తదితర పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో శుక్రవారం సర్వదర్శనానికి 30 గంటల సమయం, శనివారం 20 గంటల సమయం పట్టింది. అలాగే శ్రీశైలం ఆలయానికి రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. అంతేకాకుండా ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సైతం టూరిస్టులతో సందడిగా మారాయి.
Employees Leave | ఏడాది ముగియనున్న నేపథ్యంలో..
2025 సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఉద్యోగులు (employees), టీచర్ల సాధారణ సెలవులు (CL) కొన్ని ఎక్స్పైరీ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వీటిని ఉపయోగించుకునేందుకు సైతం ఉద్యోగులు సెలవు పెట్టిట్లు తెలుస్తోంది. ఒక్క విద్యాశాఖలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల వరకు టీచర్లు లీవ్ అప్లయ్ చేసినట్లు సమాచారం.