HomeతెలంగాణLocal Body Elections | ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హులే..

Local Body Elections | ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హులే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ విడుదల కావడంతో ఆశావహులు పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. పార్టీ నుంచి టికెట్​ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

అయితే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో జనాభా నియంత్రణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో (Local Body Elections) పోటీకి అనర్హులు అనే నిబంధనను 1995లో తీసుకొచ్చారు. దీంతో ఇద్దరికి మించి పిల్లలు ఉన్న వారు పోటీ చేసే అవకాశం లేదు. అయితే ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నిబంధన తొలగిస్తామని గతంలో మంత్రి సీతక్క(Minister Seethakka) సైతం హామీ ఇచ్చారు. దీంతో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం లభిస్తుందని ఆశించారు.

Local Body Elections | షెడ్యూల్​ విడుదల అవడంతో..

రాష్ట్రంలో 1995 నుంచి ఇద్దరికి మించి పిల్లలు ఉన్న వారు పోటీ చేయడానికి అనర్హులనే నిబంధన అమలులో ఉంది. అయితే ఈ నిబంధన ఎత్తి వేయడానికి ప్రభుత్వం ఎలాంటి జీవో జారీ చేయలేదు. తాజాగా ఎన్నికల సంఘం(Election Commission) ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. దీంతో పాత నిబంధన మేరకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితంగా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.

Local Body Elections | అక్కడ తీసేశారు

ఆంధ్రప్రదేశ్​లో రెండోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నలుగురు పిల్లలను కనాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు పోటీకి అనర్హులు అనే నిబంధన తొలగించారు. దీంతో ఎంత మంది పిల్లలు ఉన్న అక్కడ పోటీ చేయవచ్చు. గతంతో తెలంగాణలో సైతం బీఆర్​ఎస్​ హయాంలో జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ నిబంధన తొలగించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈ నిబంధన తీసేస్తారని చాలా మంది ఆశించారు. తాము పోటీ చేస్తామని కలలు కన్నారు. అయితే షెడ్యూల్​ వెలువడటంతో పాత నిబంధన ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇద్దరికి మించి పిల్లలు ఉండి పోటీ చేద్దామనుకున్న వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Must Read
Related News