అక్షరటుడే, ఇందూరు : BJP Nizamabad | హైదరాబాద్ (Hyderabad) శివారులో గోవుల అక్రమ తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేసిన గోరక్షకుడు సోను సింగ్‌పై కాల్పులు జరిపిన ఇబ్రహీంను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) అన్నారు.
జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar)కు శనివారం వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. కాల్పుల ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడానికి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మండల నాయకులు పాల్గొన్నారు.
