అక్షరటుడే,ఇందూరు: Vishwa Hindu Parishad | హైదరాబాద్ శివారులోని పోచారం ఐటీ కారిడార్లోని యమ్నంపేట వద్ద గోరక్షకుడిపై (Gorakshak) దాడిచేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా (NTR Chowrastha) వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భగా వారు మాట్లాడుతూ.. గోరక్షకులపై దాడులను నిలువరించాలని కోరారు. గోవులను అక్రమంగా తరలిస్తుంటే అడ్డుకున్నందున అతడిపై దాడిచేయడం క్రూరమైన చర్యగా వారు అభివర్ణించారు. అలాగే నిందితుల వద్దకు గన్స్ ఎలా వచ్చాయే విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేకపోతే హిందూ సంఘాలు చూస్తూ ఊరుకోబోవని చెప్పారు. కార్యక్రమంలో పరిషత్ జిల్లా కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సహా కార్యదర్శి దాత్రికా రమేష్, జిల్లా సేవా ప్రముఖ్ రాంప్రసాద్ చటర్జీ, నగర కార్యదర్శి బాసొల్లా నీకేష్, బజరంగ్దళ్ (Bajrang Dal) నగర సంయోజక్ పేట అఖిల్, అఖిలేష్, హర్షవర్ధన్, హిందూవాహిని, హైందవ సేన, ఆర్యాసమాజ్, గోరక్ష విభాగ్ తదితరులు పాల్గొన్నారు.

