HomeజాతీయంRajnath Singh | ఎర్రకోట పేలుడు బాధ్యులను వదిలిపెట్టం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక

Rajnath Singh | ఎర్రకోట పేలుడు బాధ్యులను వదిలిపెట్టం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక

ఢిల్లీలో పేలుడుకు కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ సాగుతోందన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajnath Singh | ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు చోటు చేసుకొని 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంగళవారం రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ (Defence Minister Rajnath Singh) స్పందించారు.ఢిల్లీలో సోమవారం సాయంత్రం పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఘటన స్థలంలో తొమ్మిది మంది మృతి చెందగా.. చికిత్స పొందుతూ ముగ్గురు మంగళవారం చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాజ్​నాథ్​ సింగ్​ మాట్లాడుతూ.. ఈ ఘోర విషాదానికి బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రకటించారు. దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేస్తున్నాచని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ నిర్వహించిన ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్‌ (Delhi Defense Dialogue)లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఈ సంఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.

Rajnath Singh | అమిత్ షా సమీక్ష

ఢిల్లీ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలలో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి మంగళవారం ఈ సమావేశం జరిగింది. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ దేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ డేట్ తదితరులు పాల్గొన్నారు. పేలుడు తర్వాత పరిస్థితి, దర్యాప్తు పురోగతిపై అధికారులు ఆయనకు వివరించారు.

Must Read
Related News