Homeబిజినెస్​IPO | ఈ వారంలోనూ ఇన్వెస్టర్లకు పండుగే.. ఐపీవోకు వస్తున్న ఏడు కంపెనీలు

IPO | ఈ వారంలోనూ ఇన్వెస్టర్లకు పండుగే.. ఐపీవోకు వస్తున్న ఏడు కంపెనీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | స్టాక్‌ మార్కెట్‌లోకి ఐపీవోలు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇన్వెస్టర్లకు పండుగ చేయడానికి ఈ వారంలో ఏడు కంపెనీలు వస్తున్నాయి. ఇందులో ఐదు మెయిన్‌బోర్డ్‌(Main board) కంపెనీలు కాగా.. రెండు ఎస్‌ఎంఈ(SME) సెగ్మెంట్‌కు చెందినవి. మెయిన్‌బోర్డ్‌ జాబితాలో విక్రమ్‌ సోలార్‌, జెమ్‌ ఎరోమాటిక్స్‌, శ్రీజి షిప్పింగ్‌, పటేల్‌ రిటైల్‌, మంగళ్‌ ఎలక్ట్రికల్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఉండగా.. ఎస్‌ఎంఈ విభాగంలో స్టూడియో ఎల్‌ఎస్‌డీ, ఎల్‌జీటీ బిజినెస్‌ కనెక్షన్స్‌ ఉన్నాయి. అలాగే ఏడు కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లో లిస్టవనున్నాయి. ఐపీవోల వివరాలు తెలుసుకుందామా..

Vikram Solar

విక్రమ్‌ సోలార్‌ కంపెనీ రూ. 2,079.37 సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో(IPO)కు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్‌ మంగళవారం ప్రారంభమవుతుంది. 21న ముగుస్తుంది. కంపెనీ షేర్లు 26న లిస్టవనున్నాయి. గరిష్ట ప్రైస్‌బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 332. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం రూ. 14,940తో దరఖాస్తు చేసుకోవాలి.

Shreeji Shipping Global

మార్కెట్‌నుంచి రూ. 410.71 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో శ్రీజి షిప్పింగ్‌ గ్లోబల్‌ కంపెనీ ఐపీవోకు వస్తోంది. పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 19-21 మధ్య కొనసాగుతుంది. గరిష్ట ప్రైస్‌బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 252. లాట్‌ కోసం రూ. 14,616తో దరఖాస్తు చేసుకోవాలి. కంపెనీ షేర్లు 26న లిస్టవనున్నాయి.

Gem Aromatics

జెమ్‌ ఎరోమాటిక్స్‌ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 451.25 కోట్లు సమీకరించనుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఈనెల 19 నుంచి 21 వరకు కొనసాగుతుంది. గరిష్ట ప్రైస్‌బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 325. లాట్‌ కోసం రూ. 14,950తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ షేర్లు ఈనెల 26న లిస్టవుతాయి.

Patel Retail

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 242.76 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో పటేల్‌ రిటైల్‌ కంపెనీ ఐపీవోకు వస్తోంది. కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌ 19న ప్రారంభమై 21న ముగుస్తుంది. కంపెనీ షేర్లు 26న స్టాక్‌ మార్కెట్‌(Stock Market)లో లిస్టవుతాయి. గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 255. లాట్‌ కోసం రూ. 14,790తో దరఖాస్తు చేసుకోవాలి.

Mangal Electrical Industries

మంగళ్‌ ఎలక్ట్రికల్‌ ఇండస్ట్రీస్‌ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ఈనెల 20 నుంచి 22 మధ్య ఉంటుంది. గరిష్ట ప్రైస్‌బాండ్‌ వద్ద రూ. 400 కోట్లు సమీకరించనుంది. గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 561. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం రూ. 14,586తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ షేర్లు ఈనెల 28న స్టాక్‌ మార్కెట్‌లో లిస్టవుతాయి.

Studio LSD

రూ. 70.13 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో స్టూడియో ఎల్‌ఎస్‌డీ ఐపీవోకు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్‌కు ఈనెల 20 నుంచి 22 వరకు అవకాశం ఉంది. గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 51. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్ల కోసం రూ. 2.04 లక్షలతో సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన ఈ కంపెనీ షేర్లు 25న ఎన్‌ఎస్‌ఈలో లిస్టవుతాయి.

LGT Business Connextions

ఎల్‌జీటీ బిజినెస్‌ కనెక్షన్స్‌ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ఈనెల 19 నుంచి 21 వరకు కొనసాగనుంది. కంపెనీ షేర్లు 26న స్టాక్‌ మార్కెట్‌లో లిస్టవుతాయి. గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 107. ఈ ధర వద్ద కంపెనీ రూ. 28.09 కోట్లు సమీకరించనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్ల కోసం రూ. 2,56,800తో దరఖాస్తు చేసుకోవాలి.

7 కంపెనీల లిస్టింగ్‌..

ఇక వారంలో ఏడు కంపెనీలు మార్కెట్‌లో లిస్టవనున్నాయి. మెయిన్‌బోర్డ్‌కు చెందిన బ్లూస్టోన్‌ జువెల్లరీ(BlueStone Jewellery) మంగళవారం, రెగాల్‌ రీసోర్సెస్‌(Regaal Resources) బుధవారం లిస్టవనున్నాయి. ఎస్‌ఎంఈ సెగ్మెంగ్‌కు చెందిన ఏఎన్‌బీ మెటల్‌ క్యాస్ట్‌, స్టార్‌ ఇమేజింగ్‌, మెడిస్టెప్‌ హెల్త్‌కేర్‌ షేర్లు సోమవారం, ఇకోడెక్స్‌ పబ్లిషింగ్‌ షేర్లు మంగళవారం, మహేంద్ర రియల్టర్స్‌ బుధవారం లిస్టవుతాయి.