అక్షరటుడే, ఆర్మూర్: Mla Prashanth Reddy | ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే చేతికొచ్చిన పంటలు వానలకు తడిసి ముద్దవుతున్నాయని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి (MLA Vemula Prashanth Reddy) అన్నారు. వేల్పూర్ మండలం పడగల్ (Padagal) గ్రామంలో వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
