ePaper
More
    HomeసినిమాOTT Movies |ఈ వారం థియేట‌ర్లు, ఓటీటీలో ఎన్ని సినిమాలు విడుద‌ల కాబోతున్నాయో తెలుసా?

    OTT Movies |ఈ వారం థియేట‌ర్లు, ఓటీటీలో ఎన్ని సినిమాలు విడుద‌ల కాబోతున్నాయో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:OTT Movies | ప్ర‌తి వారం సినీ ప్రేక్ష‌కుల కోసం వైవిధ్య‌మైన సినిమాల‌ను తీసుకొస్తున్నారు మేక‌ర్స్. ఒక‌వైపు థియేట‌ర్‌లో మ‌రోవైపు ఓటీటీ(OTT)లో పసందైన వినోదం అందుతుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇత‌ర భాష‌ల‌కు చెందిన సినిమాలు కూడా ఓటీటీలోకి అందుబాటులోకి వ‌స్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video), నెట్ ఫ్లిక్స్(Netflix), జియో హాట్ స్టార్(Jio Hotstar), జీ5(Zee5) వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్​లో ప‌లు సినిమాలు సంద‌డి చేయ‌నుండగా, థియేట‌ర్స్‌లో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప(Kannappa) జూన్ 27న విడుద‌ల కాబోతుంది. అలానే హిందీలో మా అనే చిత్రం రిలీజ్ అవుతుంది. విజయ్‌ ఆంటోనీ ‘మార్గన్‌: ది డెవిల్ చిత్రం కూడా ఈ వార‌మే రానుంది.

    OTT Movies | సందడే సందడి..

    ఓటీటీలో OTT స్ట్రీమ్ కానున్న సినిమాల జాబితా చూస్తే ముందుగా నెట్‌ఫ్లిక్స్​లో రైడ్‌2 (హిందీ మూవీ) జూన్‌ 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. స్క్విడ్‌ గేమ్‌: ఫైనల్‌ సీజన్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 27 వ తేదీ నుంచి, ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (రియాల్టీ షో) జూన్‌ 28 వ తేదీ నుంచి, పింటు పింటు సుర్గా (మూవీ) ఇంగ్లష్‌ జూన్‌ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇక అమెజాన్‌ ప్రైమ్ లో చూస్తే పంచాయత్‌ 4 (హిందీ సిరీస్‌) జూన్‌ 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. స‌న్ నెక్ట్స్​లో అజాదీ (త‌మిళ సినిమా)- జూన్ 27 నుండి స్ట్రీమ్ కానుండ‌గా, ఒక ప‌థ‌కం ప్ర‌కారం (తెలుగు మూవీ)- జూన్ 27 నుండి స్ట్రీమ్ కానుంది. ఇక బుక్ మై షోలో అల్ఫా (ఇంగ్లిష్ చిత్రం)- జూన్ 24 నుండి స్ట్రీమ్ కానుంది. ద బ్రేక‌ప్ క్బ‌ల్‌(డ‌చ్ మూవీ)- జూన్ 24 నుండి, ర‌క్త బీజ్ (గుజ‌రాతీ సినిమా)- జూన్ 26 నుండి స్ట్రీమ్ కానుంది.

    జియో హాట్‌స్టార్​లో Jio Hotstar స్మార్ట్‌ ఆఫ్‌ బ్యూటీ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుండ‌గా, తు దడ్కన్‌ మే దిల్‌ (హిందీ మూవీ) జూన్‌ 23వ తేదీ నుంచి, ది గిల్డెడ్‌ ఏజ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌3) జూన్‌ 23 వ తేదీ నుంచి, ఐరన్‌ హార్ట్‌ (మూవీ) జూన్‌ 25 వ తేదీ నుంచి, ది బేర్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌4) జూన్‌ 26 వ తేదీ నుంచి , మిస్టరీ (వెబ్‌సిరీస్) జూన్‌ 27 వ తేదీ నుంచి, ది బ్రూటలిస్ట్‌ (మూవీ) జూన్‌ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇక జీ5 లో చూస్తే .. విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్‌ (తెలుగు సిరీస్‌) జూన్‌ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. బిబిషన్‌ (బెంగాలీ వెబ్‌సిరీస్‌) జూన్‌ 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఆపిల్ ప్ల‌స్ టీవీ లో స్మోక్ ( ఇంగ్లీష్ సిరీస్‌)- జూన్ 27 నుండి స్ట్రీమ్ కానుంది.

    More like this

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Silver Ring | బొటనవేలికి వెండి ఉంగరం ధరించారా.. లక్ష్మీదేవి వచ్చినట్టే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Silver Ring | ప్రతి ఒక్కరి జీవితంలో ఉంగరాలు ధరించడం ఒక సాధారణ ఆచారం. మనం...

    GST Reforms | వాహన కొనుగోలుదారులకు శుభవార్త.. ప్రముఖ కార్లపై భారీగా తగ్గింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | వాహన కొనుగోలుదారులకు శుభవార్త. ప్రముఖ సంస్థల కార్ల ధరలు భారీగా...