అక్షరటుడే, వెబ్‌డెస్క్ : UAE Lottery | లాటరీలో రూ.కోటి వచ్చిందంటే ఎగిరి గంతేస్తాం.. పట్టరాని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతాం. అలాంటిది ఓ యువకుడికి ఏకంగా రూ.240 కోట్లు లాటరీలో దక్కాయి. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
గల్ఫ్ దేశాల్లో లాటరీ (UAE Lottery)లకు చాలా ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. భారత్ నుంచి వలస వెళ్లిన చాలా మంది అక్కడ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటారు. గతంలో పలువురు భారీగా డబ్బులు సైతం గెలుచుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన ఓ యువకుడు యూఏఈలో 100 మిలియన్ దిర్హామ్స్ లాటరీ గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో దాని విలువ రూ.240 కోట్లు కావడం గమనార్హం.
UAE Lottery | తల్లి పుట్టిన రోజు..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోళ్ల అనిల్‌కుమార్ (29) గత కొన్నేళ్లుగా యూఏఈలోని అబుదాబి (Abu Dhabi) ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి లాటరీ టికెట్లు కొనడం అలవాటు అయింది. ఇటీవల లాటరీ కొనుగోలు చేశాడు. అయితే ఆ టికెట్ నంబర్ తన తల్లి పుట్టిన తేది వచ్చింది. అనంతరం ఈ నెల 18 తీసిన డ్రా లో అనిల్ కుమార్ ఏకంగా రూ.240 గెలుచుకున్నాడు.
UAE Lottery | నా ప్రత్యేకత ఏమి లేదు
లాటరీ దక్కడంపై అనిల్ స్పందించాడు. ఇందులో తన ప్రత్యేకత ఏమి లేదని చెప్పాడు. అందరిలాగే లాటరీ టికెట్ (Lottery Ticket) కొన్నానని, అందులో చివరి నంబర్లు తన తల్లి పుట్టిన తేదీ కావడంతోనే అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాడు. ఈ డబ్బుతో తన తల్లిదండ్రులను అబుదాబి తీసుకువచ్చి అక్కడే స్థిరపడతానని, ఒక లగ్జరీ కారు కొంటానని, కొంత డబ్బును చారిటీలకు ఇస్తానని ప్రకటించాడు. కాగా లాటరీ ఇండియాలో గెలిస్తే దాదాపు రూ.90 కోట్లు పన్ను చెల్లించాల్సి వచ్చేదని, యూఏఈలో లాటరీపై ఎలాంటి పన్ను లేదని చెప్పాడు. దీంతో అతడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

