అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minor Driving | మైనర్ డ్రైవింగ్ కేసుల్లో (minor driving cases) పట్టుబడ్డ వారిని నిర్లక్ష్యంగా తరలించిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Nizamabad Traffic Police) మైనర్ డ్రైవింగ్ ఇటీవల స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
కాగా.. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో మైనర్లు పట్టుబడ్డారు. అనంతరం వారిని జువెనల్ కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. కాగా.. వారిని ట్రాఫిక్ పోలీసులు ఓ వాహనంలో తరలించిన ఘటన తీవ్ర విమర్శలకు దాసి తీసింది. ఓ ఎస్సై స్థాయి అధికారి పర్యవేక్షణలోనే వీరిని వివిధ కూడళ్లకు తరలించి సామాజిక సేవ చేయించాలని ఆదేశాలు ఉండగా.. ఓ టాటా ఏఎస్ వాహనంలో (Tata AS vehicle) పదుల సంఖ్యలో మైనర్లను కుక్కి ఎక్కించారు. అనంతరం ఆయా కూడళ్లకు తరలించి సామాజిక సేవ చేయించారు.
కాగా.. పిల్లలను ప్రమాదకరంగా గూడ్స్ వాహనంలో తరలించడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే పిల్లల పరిస్థితి ఏమిటని ఆవేదన వెలిబుచ్చారు. మరోవైపు బాలలను తరలించే తీరు ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీని సంప్రదించగా.. టాటా ఏస్ వాహనంలో పదుల సంఖ్యలో బాలలను తరలించిన విషయం తన దృష్టికి రాలేదన్నారు.
![]()
