Homeక్రీడలుIPL 2025 | ఉగ్ర కుట్ర భ‌యం.. అందుకే హైద‌రాబాద్ నుండి మ్యాచ్‌ల‌ని మార్చారా..!

IPL 2025 | ఉగ్ర కుట్ర భ‌యం.. అందుకే హైద‌రాబాద్ నుండి మ్యాచ్‌ల‌ని మార్చారా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 | భార‌త్-పాకిస్తాన్ యుద్ధ వాతావ‌ర‌ణంతో ఐపీఎల్‌(IPL)కి తొమ్మిది రోజుల పాటు బ్రేక్ ప‌డింది. తిరిగి మే 17 నుండి మొద‌ల‌య్యాయి. అయితే హైద‌రాబాద్ (Hyderabad) వేదిక‌గా జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ల‌ని బీసీసీఐ BCCI స‌డెన్‌గా వేరే ప్ర‌దేశానికి మార్చింది. ఇప్పుడు ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఉగ్ర కుట్ర‌భ‌యంతోనే వేదిక మార్చారనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి.

IPL 2025 | కార‌ణం ఏంటి?

విజయనగరానికి చెందిన సిరాజ్‌ ఉర్‌ రహమాన్‌, సికింద్రాబాద్‌కు చెందిన సమీర్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సోషల్‌మీడియా వేదికగా ఒక్కటైన ఇరువురు దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నినట్లు విచారణలో బయటపడింది. బాంబులు తయారు చేసి వాటిని విజయనగరం ప్రాంతంలోని అడవుల్లో ఈ నెల 21, 22వ తేదీల్లో పేల్చి రిహార్సల్స్‌ చేయాలనుకోగా, వాటిని విఫ‌లం చేశారు పోలీసులు(Police). అయితే ఎక్కువ మొత్తంలో టిఫిన్‌ బాంబులు తయారు చేసి వాటిని హైదరాబాద్‌తో Hyderabad పాటు ఇతర ప్రధాన నగరాలలో పేల్చి బీభత్సం సృష్టించేందుకు కుట్ర చేశారనే విషయం విచారణలో తేలింది.

అయితే హైదరాబాద్‌కు ఉగ్ర ముప్పు ఉండే అవకాశాలను ముందుగానే నిఘా సంస్థలు (Intelligence agencies) గుర్తించి ఇక్కడ మ్యాచ్‌ల నిర్వాహణను రద్దు చేసుకోవాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌లో జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ల‌ని వేరో చోటికి త‌ర‌లించారు. హైదరాబాద్‌లో జరుగాల్సిన మూడు మ్యాచ్‌ల వేదికలు మారాయి.

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (Hyderabad Cricket Association)తో పాటు రాచకొండ పోలీసులు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐకి చెప్పినా.. వేదికను ఎందుకు మార్చారనేది తెలియ‌డం లేదు. ఈ మ‌ధ్య ఉప్పల్‌ స్టేడియంలో (Uppal Stadium) జరిగిన ఆరు క్రికెట్‌ మ్యాచ్‌లకు నిర్వహించిన బందోబస్తుపై రాచకొండ పోలీసులను ఐపీఎల్‌ నిర్వాహకులు ప్రశసించినట్లు అధికారులు తెలిపారు. అయినా కూడా హైదరాబాద్‌లో మ్యాచ్‌లకు ఎందుకు చోటివ్వలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. నిఘా సంస్థలు ముందుగానే హెచ్చరించం వ‌ల్ల‌నే బీసీసీఐ హైద‌రాబాద్‌లో మ్యాచ్‌ల‌ని ర‌ద్దు చేసి ఉంటుంద‌ని తెలుస్తోంది.