More
    HomeజాతీయంPM Modi | ఇది నయా భారత్.. అణుబెదిరింపులకూ భయపడబోమన్న ప్రధాని..

    PM Modi | ఇది నయా భారత్.. అణుబెదిరింపులకూ భయపడబోమన్న ప్రధాని..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఇది సరికొత్త భారతదేశమని, అణుబాంబు బెదిరింపులకు భయపడబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శత్రువుల ఇళ్లలోకి వెళ్లి ఉగ్రవాదులను సరికొత్త దేశమని వ్యాఖ్యానించారు. ఎవరి అణుబెదిరింపులకు బెదిరిపోదని తేల్చి చెప్పారు.

    ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా మన దేశ సత్తా ప్రపంచం చూసిందన్నారు. బుధవారం మధ్యప్రదేశ్​లోని థార్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ‘స్వస్థ్ నారీ – స్వశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తల్లులు, సోదరీమణులకు అంకితం చేసినట్లు ప్రకటించారు. దేశంలోని కోట్లాది మంది తల్లుల ఆశీర్వాదం ఉంటే తాను ఏదైనా సాధిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. కోటాను కోట్ల తల్లులు తనకు ఎన్నోసార్లు ఆశీస్సులు అందించారని గుర్తు చేసుకున్నారు. ఇంట్లో తల్లి బాగుంటే.. ఇళ్లన్నీ బాగుంటాయని తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశ నిర్మాణంలో దోహదపడుతున్న లక్షలాది మంది నైపుణ్యం కలిగిన కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

    PM Modi | ఘర్ మే ఘుస్ కే మార్తా హై

    అణు బెదిరింపులకు భారత్ భయపడదని ప్రధాని స్పష్టం చేశారు. మన సోదరీమణుల సిందూరం తూడ్చివేసిన వారిని తుదముట్టించామని, వారి దేశంలోకి వెళ్లి మరీ మట్టుబెట్టామన్నారు. ఆపరేషన్ సిందూర్​తో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పామన్నారు. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నారు. తాము బతికేది దేశం కోసమని ఆయన స్పష్టం చేశారు.

    “ఒక పాకిస్తాన్ ఉగ్రవాది తన కష్టాలను కన్నీళ్లతో గుర్తుచేసుకోవడాన్ని నిన్ననే మన దేశంతో పాటు ప్రపంచం చూసింది. ఇది సరికొత్త భారతదేశం, ఎటువంటి అణు బెదిరింపులకు భయపడని దేశం. శత్రువులు భూభాగంలోకి వెళ్లి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టిన దేశమిది. (అభి కల్ హి దేశ్ ఔర్ దునియా నే దేఖా హై ఫిర్ ఏక్ పాకిస్తానీ ఆతంకి నే రో రో కర్ అప్నా హాల్ బటాయా హై. యే నయా భారత్ హై. యే కిసీ కి పర్మాను ధమ్కీ సే డర్తా నహీ హై. ఘర్ మే ఘుస్ కే మార్తా హై)” అని వ్యాఖ్యానించారు.

    PM Modi | మోకరిల్లేలా చేశాం..

    భద్రత విషయంలో రాజీ పడబోమని, భారత్ ఎవరి బెదిరింపులకు భయపడదని మోదీ స్పష్టం చేశారు. పహల్గామ్​లో మన బిడ్డల సిందూరం తూడ్చివేసిన వారిని మట్టుబెట్టడమే కాదు, ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రువులను మోకాళ్లపై కూర్చోబెట్టామని చెప్పారు. “భారతమాత భద్రతకు దేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు(Pakistan Terrorists) మన సోదరీమణులు, కుమార్తెల సిందూర్​ను తూడ్చేశారు. ఉగ్రవాదులతో పాటు వారిని పెంచి పోషిస్తున్న వారిపై మేము ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం. శత్రువు గడ్డ మీదకు వెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాం. ధీరులైన మన సైనికులు కన్నుమూసి తెరిచేలోపు పాకిస్తాన్ను మోకరిల్లేలా చేశారు. ఇది కొత్త భారతదేశం. ఇది ఎవరి అణు బెదిరింపులకు భయపడదు..” అని చెప్పారు. సరిహద్దు ఉగ్రవాదంపై ఇటీవలి సైనిక విజయాలను ఆయన ప్రస్తావించారు. భారత సైన్యం ఉగ్రవాద శిబిరాలను కూల్చివేసి పాకిస్తాన్​ను ఎలా మోకరిల్లేలా చేసిందో వివరించారు.

    PM Modi | జీఎస్టీ సంస్కరణలతో ఎంతో మేలు..

    స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని తద్వారా ఈ దేశాన్ని మరింత బలోపేతం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలనే జీఎస్టీలో సంస్కరణలు (GST Reform) తీసుకొచ్చామన్నారు. “సెప్టెంబర్ 22 (సోమవారం) నవరాత్రి మొదటి రోజు నుంచి GST సంస్కరణలు అమలు చేయబడతాయి. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి దుకాణంలో ‘గర్వ్ సే కహో, యే స్వదేశీ హై’ అని రాసి ఉన్న బోర్డు ప్రదర్శించాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం నిర్వహించాలి.” అని కోరారు.

    PM Modi | ఉక్కు సంకల్పంతో హైదరాబాద్ విముక్తి..

    సంవత్సరాల తరబడి అణచివేతకు గురైన హైదరాబాద్ సంస్థానానికి సెప్టెంబర్ 17న విముక్తి లభించిందని ప్రధాని అన్నారు. అణచివేత నుంచి విముక్తి చేసిన సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పాన్ని ప్రశంసించారు. భారతదేశ ఐక్యతను బలోపేతం చేయడంలో దీని ప్రాముఖ్యతను మోదీ నొక్కిచెప్పారు. చేశారు. అలాంటి త్యాగాలు, శౌర్యం ప్రతి పౌరుడిని దేశం కోసం తమను తాము అంకితం చేసుకోవడానికి ప్రేరేపిస్తూనే ఉంటాయన్నారు.

    PM Modi | మహిళా కేంద్రీకృత కార్యక్రమాలను ప్రారంభించడం..

    అట్టడుగు స్థాయిలో ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో కొత్త మహిళా కేంద్రీకృత పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. మహిళలను శక్తివంతం చేయడం, సమాజ అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన పీఎం మిత్రా పార్క్​ను (PM Mitra Park) కూడా ప్రారంభించారు.

    More like this

    KTR | కేసీఆర్​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో తెలుసు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో...

    Pakistan Cricket | పాకిస్తాన్ సంచలన నిర్ణయం?.. యూఏఈతో క్రికెట్ మ్యాచ్ బాయ్కాట్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Cricket | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్(Asia...

    Dichpally mandal | గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally mandal | డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​కు (Ghanpur) చెందిన యువకులు గ్రామ పంచాయతీకి బాడీ...